India vs Australia: అహ్మదాబాద్ లో అద్భుతమైన భారత వైమానిక సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో

Published : Nov 19, 2023, 03:41 PM ISTUpdated : Nov 19, 2023, 04:09 PM IST
India vs Australia:  అహ్మదాబాద్ లో అద్భుతమైన భారత వైమానిక సూర్యకిరణ్ టీమ్  ఎయిర్ షో

సారాంశం

భారత, అస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను పురస్కరించుకొని నాలుగు భాగాలుగా  కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తొలుత  భారత వైమానిక దళం ఎయిర్ షో ను నిర్వహించింది. 

న్యూఢిల్లీ: ప్రపంచకప్ పురుషుల వన్ డే క్రికెట్ 2023  ఫైనల్ మ్యాచ్ కు ముందు  అహ్మదాబాద్ లోని  నరేంద్ర మోడీ స్టేడియం వద్ద  భారత వైమానికి దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్  ఆదివారంనాడు అద్భుతమైన ఎయిర్ షోను ప్రదర్శించింది.ఆదివారంనాడు మధ్యాహ్నం  భారత్, అస్ట్రేలియా  క్రికెట్ జట్ల మధ్య  మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఎయిర్ షో జరిగింది.

 

 

శుక్ర,శనివారాల్లో  ఎయిర్ షో రిహార్సల్స్ జరిగాయి.  సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్  సాధారణంగా  తొమ్మిది విమానాలను కలిగి ఉంటుంది. దేశ వ్యాప్తంగా అనేక ప్రదర్శనల ద్వారా తన పరాక్రమాన్ని  ఈ టీమ్  ప్రదర్శించింది.ఈ ఎయిర్ షో  పలువురిని ఆకట్టుకుంది.  అస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !