
IND vs AUS Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. థ్రిల్లింగ్ మ్యాచ్ లతో గ్రూప్ దశ మ్యాచ్ లు ముగిశాయి. ఇప్పుడు సెమీ ఫైనల్ పోరుకు ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీ ఫైనల్ లో క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందిన ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్లు ఆదివారం జరిగే టైటిల్ పోరులో పోటీ పడతాయి.
ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ స్టేజ్ అంటేనే మజాను అందించే డ్రామా, థ్రిల్లింగ్ క్రికెట్‌కు వేదికగా ఉంటుంది. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా అంతే. ఇరు జట్లు గత రికార్డులు, చరిత్ర, మ్యాచ్ లు గమనిస్తే మరో ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ మ్యాచ్ ను చూడవచ్చు. ప్రస్తుతం ఇరు జట్లు సూపర్ ఫామ్‌తో బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఆసీస్ తో మ్యాచ్ అంటే భారత అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది 2023 ఐసీసీ ప్రపంచ కప్. దీంతో పాటు చాలా వరుక ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ కు షాకిచ్చింది ఆస్ట్రేలియా. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్లు లేకపోయినా పెద్ద మ్యాచ్‌ల్లో సత్తా చాటే సత్తా గురించి ఎవరూ ప్రశ్నించలేరు. ఐసీసీ టోర్నమెంట్లు అంటే చాలు పూనకం వచ్చిన వారిలా ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడతారు. అయితే, ఇప్పుడు భారత జట్టు తక్కువగా అంచనా వేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ ఐసీసీ టోర్నమెంట్ ను హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదుంది. భారత జట్టులోని బ్యాటర్లు, బౌలర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి భారత్ జట్టు గెలవడం పక్కా అని క్రికెట్ సర్కిల్ టాక్.
ఇండియా
న్యూజిలాండ్‌పై గెలిచిన తర్వాత ఇండియా ఫామ్‌ను తప్పు పట్టలేం. దుబాయ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ స్టేజ్‌ను పర్ఫెక్ట్‌గా ముగించింది. దుబాయ్ పరిస్థితులకు అలవాటు పడటానికి ఆ మ్యాచ్‌లు, సమయం బాగా ఉపయోగపడ్డాయి. ఇండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. దీనికి తోడు జట్టులోని రోహిత్, విరాట్, శ్రేయాస్, కేఎల్ రాహుల్ సహా అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు.
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా ఆడిన మూడు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్లో రెండు వర్షం వల్ల ఆగిపోయాయి. ఒకటి పూర్తిగా రద్దయింది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం గెలిచేలా కనిపించింది. కానీ వర్షం అంతరాయం కలిగించింది. టోర్నీ ఆరంభంలో ఇంగ్లాండ్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది. దీంతో నాలుగు పాయింట్లతో సెమీస్ కు చేరింది. ఐసీసీ టోర్నమెంట్లలో అదరగొట్టే విషయం ఆస్ట్రేలియా జట్టు ప్రధాన బలాల్లో ఒకటిగా చెప్పవచ్చు. దాదాపు అందరు ప్లేయర్లు ప్రత్యర్థి జట్టుపై ఏ సమయంలోనైనా ప్రభావం చూపే సత్తా చూపుతారు.
ఇండియా: కుల్దీప్ యాదవ్
ఇండియా స్పిన్ బౌలింగ్ బాగా ఉండటంతో కుల్దీప్ కీలకం కానున్నాడు. కంగారు టీమ్ పై మంచి రికార్డులు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఎక్కువ వికెట్లు తీశాడు. బంతి స్వింగ్ అవ్వడం ఆగిపోయాక మిడిల్ ఓవర్లలో కుల్దీప్ చెలరేగే అవకాశం ఉంది. పాకిస్తాన్‌పై 3/40 తీసుకొని ప్రత్యర్థిని 241 పరుగులకే కట్టడి చేశాడు. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ లైనప్ ఈజీగా ఛేదించింది.
ఆస్ట్రేలియా: ఆడమ్ జంపా
దుబాయ్‌లో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్లు రాణించాల్సి ఉంది. ఆస్ట్రేలియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్తుందా? లేక అదనపు స్లో బౌలర్‌ను తీసుకుంటుందా అనేది చూడాలి. ఏది ఏమైనా జంపా తన 10 ఓవర్లలో రాణించాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తన బెస్ట్ ఫామ్‌లో లేనని స్వయంగా జంపనే చెప్పాడు. కాబట్టి ఇది అతనికి నిరూపించుకునే సమయం ఇదే.
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.
Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్ బ్రేకబుల్ టాప్-5 రికార్డులు