India vs Australia: అవును నిజమే ఆసీస్ బలమైన టీమ్.. భారత కెప్టెన్ రోహిత్ షాకింగ్ కామెంట్స్ !

Published : Mar 03, 2025, 09:21 PM IST
India vs Australia: అవును నిజమే ఆసీస్ బలమైన టీమ్.. భారత కెప్టెన్ రోహిత్ షాకింగ్ కామెంట్స్ !

సారాంశం

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Champions Trophy Semi-Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా గ్రూప్ మ్యాచ్ లలో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ లోకి అగుడుపెట్టింది. మంచి ఫామ్ లో ఉన్న భారత్ సెమీస్ లో ఆసీస్ ను చిత్తు చేసి 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో ఐసీసీ టోర్నమెంట్ అంటే చాలు మరింత బలంతో అదరగొడుతుంది కంగారు టీమ్. ముఖ్యంగా ఆ జట్టులోని పలువురు ప్లేయర్లు భారత్ పై అద్భుతంగా రాణించిన ఇన్నింగ్స్ లు ఉన్నాయి. అందుకే భారత జట్టు ఆసీస్ తక్కువ అంచనా వేయకుండా గెలుపుకోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

ఆసీస్ తో భయం లేదు.. టీమిండియాకు తన బలంపై నమ్మకముంది: రోహిత్ శర్మ

 

కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా బలమైన టీమ్ అని తెలుసు. ఆసీస్ గట్టి టీమే అయినా, తమ ప్రణాళికల మీదే దృష్టి పెడతామని చెప్పాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం కదా, ఇప్పుడు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ అంటే  ఏదైనా ఎక్కువ ఉత్సాహం ఉందా అని అడిగితే, అలాంటిదేమీ లేదని రోహిత్ చెప్పాడు. ఆసీస్ తో ఆడటం ఛాలెంజ్ గా ఉంటుందని చెప్పాడు. "లేదు, వాళ్ళతో ఆడటం చాలా బాగుంటుంది. మేం గత మూడు మ్యాచ్లుగా ఏం చేస్తున్నామో అదే చేస్తాం. అదే విధంగా ఆడతాం" అని రోహిత్ చెప్పాడు.

ఆసీస్ ఏం చేస్తుందో తెలుసు.. మా వ్యూహాలు మాకున్నాయి : భారత కెప్టెన్ రోహిత్ 

 

ఆస్ట్రేలియా ఎంత బలమైన జట్టు తెలుసని రోహిత్ శర్మ అన్నారు. ఆస్ట్రేలియా ఒత్తిడిలో బాగా ఆడుతుందని తెలుసు, కానీ ఇండియా తన బలం మీద దృష్టి పెట్టాలని అన్నాడు. "వాళ్ళు ఎలా ఆడతారో మాకు తెలుసు. కానీ మన జట్టుగా, ఆటగాళ్లుగా మనమేం చేయాలో దాని మీద దృష్టి పెడితే మంచిది" అని హిట్ మ్యాన్ చెప్పారు. మరీ ముఖ్యంగా పెద్ద మ్యాచ్ లు, టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా గట్టిగానే పోరాడుతుందనీ, మరింత బలంతో ప్రత్యర్థి జట్టుపై అటాక్ చేస్తుందని చెప్పాడు. 

"అవును, ఆస్ట్రేలియా చాలా గొప్ప టీమ్. వాళ్ళు గట్టిగా పోరాడతారు. కొన్నిసార్లు భయంగా కూడా ఉంటుంది. కానీ ఆటంటేనే అంతే" అని రోహిత్ శర్మ అన్నాడు. ఫైనల్ కు వెళ్లాలంటే ఇరు జట్లకూ ఒత్తిడి ఉంటుంది. కానీ ఇండియా తన ఆట మీద దృష్టి పెడితే గెలవడం ఖాయం అని రోహిత్ నమ్మకంగా చెప్పాడు. "ఇది సెమీఫైనల్. గెలవాలని ఇరు జట్లకూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలో దాని మీద దృష్టి పెడితే చాలు. అన్నీ సరిగ్గా చేస్తే విజయం మనదే" అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 

ఇవి కూడా చదవండి:

Mutton: మేకకు, గొర్రెకు తేడా ఏంటి.? రెండింటిలో ఏ మాంసం తింటే మంచిది

Solar Eclipse 2025: మార్చిలో మొదటి సూర్యగ్రహణం.. ఈ 3 రాశుల వారికి కష్టాలు, కన్నీళ్లే!

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?