IND vs AFG 2nd T20I: టాస్ గెలిచిన భార‌త్.. జ‌ట్టులోకి కోహ్లీ, జైస్వాల్

By Mahesh Rajamoni  |  First Published Jan 14, 2024, 6:42 PM IST

IND vs AFG 2nd T20I: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య 2వ టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. మొహాలీలో తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో గెలిచిన భార‌త్ రెండో మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తోంది.  విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ లకు తుది జట్టులో చోటుదక్కింది.  
 


India vs Afghanistan 2nd T20: మొహాలీలో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా ఆఫ్ఘ‌నిస్తాన్ పై గెలిచిన ఆతిథ్య జట్టు భార‌త్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా శివమ్ దూబే అద‌ర‌గొట్ట‌డం, జితేష్ శర్మ, తిల‌క్ లు రాణించ‌డంతో భార‌త్ తొలి టీ20లో విజ‌యం సాధించింది. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ లో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లోనూ విజ‌యం సాధించి సిరీస్ ను కైవ‌సం చేసుకోవాలని చూస్తోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో తొలి గేమ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.

టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘ‌నిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొద‌ట బౌలింగ్ చేయ‌డానికి ఎలాంటి కార‌ణంగా లేద‌ని చెప్పిన రోహిత్ శ‌ర్మ‌.. ఛేజింగ్ చేయ‌డానికి గ్రౌండ్ అనుకూలంగా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. భార‌త్ ప్లేయ‌ర్లంద‌రూ మెరుగ్గా రాణిస్తున్నార‌ని చెప్పాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా భావిస్తున్నామ‌ని తెలిపారు. గెల‌వ‌డం కీల‌క‌మ‌ని పేర్కొన్నాడు.  శుభ్ మ‌న్ గిల్, తిల‌క్ వ‌ర్మల ప్లేస్ లో విరాట్ కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్ ను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్టు చెప్పాడు.

Latest Videos

undefined

IND vs AFG: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్ట‌నున్న రోహిత్ శ‌ర్మ.. అలాగే, ఎంఎస్ ధోని.. !

జ‌ట్లు ఇవే.. 

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): 

రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ హక్.

IND vs PAK: క్రేజీ బ‌జ్.. భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్.. 

click me!