Virat Kohli: కూతురు బర్త్ డే.. ఆటగాడిగా వందో టెస్టు.. వావ్.. విరాట్ కోహ్లీకి మరిచిపోలేని రోజు అదే..!

Published : Dec 07, 2021, 05:02 PM IST
Virat Kohli: కూతురు బర్త్ డే.. ఆటగాడిగా వందో టెస్టు.. వావ్.. విరాట్ కోహ్లీకి మరిచిపోలేని రోజు అదే..!

సారాంశం

Virat Kohli 100th Test: త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా పర్యటన భారత సారథి విరాట్ కోహ్లీకి మరిచిపోలేని జ్ఞాపకాలను పంచనుంది.  తన కెరీర్ తో పాటు కుటుంబానికి సంబంధించిన రెండు ప్రత్యేకమైన ఈవెంట్లు ఒకే రోజు జరుగనున్నాయి.  

టీమిండియా టెస్టు, వన్డే సారథి విరాట్ కోహ్లీకి వచ్చే ఏడాది జనవరి 11 ప్రత్యేకమైన రోజు కానుంది. ఆ రోజు కోహ్లీ-అనుష్కల గారాల పట్టి వామిక మొదటి పుట్టిన రోజు కాగా.. అదే రోజు విరాట్ తన కెరీర్ లో మరో అరుదైన ఘనతను సాధించనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీ.. ఈ ప్రత్యేకమైన రోజును తన టీమ్ మేట్స్ తో జరుపుకోబోతున్నాడు. ఇంతకీ కోహ్లీకి ఆ ప్రత్యేకమైన రోజేంటంటే... దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డిసెంబర్ 26న భారత్ తొలి టెస్టు ఆడనున్నది. ఇక రెండో టెస్టు జనవరి 3నుంచి ప్రారంభం కానుండగా.. సిరీస్ లో ఆఖరుదైన మూడో టెస్టు..  జనవరి 11 న మొదలుకావాల్సి ఉంది. ఇది కోహ్లీకి వందో టెస్టు. 

సోమవారం న్యూజిలాండ్ తో ముంబైలో ముగిసిన రెండో టెస్టు లో ఆడిన కోహ్లీకి అది 97వ టెస్టు. ఇక దక్షిణాఫ్రికాతో పర్యటనలో.. ఒకవేళ కోహ్లీ గాయపడితే తప్ప తొలి రెండు టెస్టులు ఆడటం ఖాయం. కేప్ టౌన్ లో జరిగే మూడో టెస్టుతో కోహ్లీ వందో టెస్టు ఆడనున్నాడు. సరిగ్గా ఇదే రోజు.. అంటే జనవరి 11న కోహ్లి కూతురు వామిక ఫస్ట్ బర్త్ డే కూడా జరుపుకోనుంది. 

ఈ ఏడాది జనవరి 11న జన్మించిన వామిక ఫోటో గానీ, ఆమెకు సంబంధించిన చిన్న వీడియో గానీ ఇంతవరకు బయిటి ప్రపంచానికి తెలియదు. కారణాలేవైనా వామిక ఫోటోలను కోహ్లీ గానీ, అనుష్క గానీ ఇంతవరకు మీడియాకు విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయలేదు.  దీంతో వామికను చూడటానికి అతడి అభిమానులతో పాటు  క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూపులు చూస్తున్నారు. మరి కూతురు ఫస్ట్ బర్త్ డే లో అయినా కోహ్లీ.. తన కూతురును ప్రపంచానికి పరిచయం చేస్తాడో చూడాలి. 

ఇక కెరీర్ లో ఇప్పటివరకు 97 టెస్టులాడిన విరాట్.. 50.65 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి.  కాగా.. కోహ్లీ టెస్టుల్లో సెంచరీ చేయక రెండేండ్లు దాటిపోయింది. మరి సౌతాఫ్రికాలో అయినా విరాట్ ఆ ముచ్చట తీర్చుతాడా..? లేదా...? అన్నది అతడి ఫ్యాన్స్ లో మెదులుతున్న ప్రశ్న. ఒమిక్రాన్ నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదాపడ్డ దక్షిణాఫ్రికా పర్యటనలో.. టీ20 సిరీస్ ను వాయిదా పడగా.. టెస్టు, వన్డే సిరీస్ లు మాత్రం జరుగుతాయి. 

 

షెడ్యూల్ ఇలా.. 
డిసెంబర్ 26-30  : తొలి టెస్టు - సెంచూరియన్
జనవరి 03-07: రెండో టెస్టు - జోహన్నస్బర్గ్
జనవరి 11-15: మూడో టెస్లు - కేప్ టౌన్
జనవరి 19: తొలి వన్డే - పార్ల్
జనవరి 21: రెండో వన్డే - పార్ల్
జనవరి 23: మూడో వన్డే - కేప్ టౌన్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?