Sarah Tendulkar: మోడలింగ్ లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ కూతురు.. అఫిషియల్ వీడియో అదుర్స్

Published : Dec 07, 2021, 12:42 PM IST
Sarah Tendulkar: మోడలింగ్ లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ కూతురు.. అఫిషియల్ వీడియో అదుర్స్

సారాంశం

Sarah Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మోడలింగ్ లోకి కాలుమోపింది.  ఓ ప్రముఖ వస్త్ర కంపెనీకి ఆమె మోడల్ గా వ్యవహరిస్తున్నది.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు  సారా టెండూల్కర్ నాన్న చాటు బిడ్డలా కాకుండా సొంతగా రాణించాలని కోరుకుంటున్నది. నాన్న Cricket లో అదరగొడితే.. Sarah Tenulkar మాత్రం ఎంబీబీఎస్ చదివి తనకు నచ్చిన వృత్తిలోకి అడుగిడింది. తనకు ఎంతో ఇష్టమైన మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజుల నుంచి  అదే ప్రయత్నాల్లో ఉన్న సారా.. తాజాగా  ఆ ముచ్చట కూడా తీర్చుకుంది. ఓ ప్రముఖ  వస్త్ర బ్రాండ్ కు ఆమె మోడల్ గా వ్యవహరిస్తున్నది. ఈ మేరకు ఓ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది. 

ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్.. Ajioluxe కు ఆమె మోడల్ గా వ్యవహరిస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె Instagram లో పంచుకుంది. ఈ వీడియోలో ప్రముఖ నటి బనితా సంధు, తానియా ష్రాఫ్ లతో కలిసి సారా తళుక్కుమంది. 

 

ప్రముఖ బ్రిటిష్ నటి అయిన Banitha Sandhu.. బాలీవుడ్ లో అక్టోబర్, ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి తమిళ్ రిమేక్), ఎటర్నల్ బ్యూటీ, కవితా అండ్ తెరిసా చిత్రాలలో నటించింది.  ఇక Tania Shroff.. ముంబైకి చెందిన ప్రముఖ  పారిశ్రామికవేత్త  జయదేవ్ ష్రాఫ్ కూతురు. తానియా.. సునీల్ శెట్టి కుమారుడు  Ahan Shettyతో రిలేషన్  లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పన్లేదు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారాల పట్టి అయిన  సారా.. తన అన్నయ్య అర్జున్ టెండూల్కర్ లా క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోకున్నా.. మోడలింగ్ లో రాణించాలని భావిస్తున్నది. 

 

ఇదిలాఉండగా.. సారా  మోడలింగ్ లోకి  వస్తుందని తెలిసిన తర్వాత చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మోడలింగ్ కెరీర్ లో  సారా విజయవంతంగా  కొనసాగాలని విష్ చేస్తున్నారు.

గతంలో శుభమన్  గిల్ తో ఆమె ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చినా ఈ ఇద్దరూ గానీ, Sachin Tendulkar గానీ  ఈ వ్యవహారం గురించి నోరు మెదపలేదు. కొద్దిరోజుల క్రితమే గిల్.. ‘ఏంజిల్స్ తో ప్రేమలో పడకూడదు..’ అంటూ ఓ పోస్టు  చేయడంతో వీరిద్దరి మధ్య  బ్రేకప్ అయిందని సోషల్ మీడియాలో జనాలు చెప్పుకున్నారు. అనంతరం ఇటీవలే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తో డేట్ కు వెళ్లిన సారా.. అభిమానులను సర్ఫ్రైజ్ కు గురి చేసింది. మొత్తానికైతే  ఏదో ఒక  వార్తతో ఆమె సోషల్ మీడియాలో వార్తల్లో వ్యక్తిగానే ఉంటున్నది. ఇక తాజాగా ఆమె మోడలింగ్ లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !