ధోనీ అవసరం చాలా ఉంది, కానీ అదంతా కోహ్లీ చేతిలోనే.. సురేష్ రైనా

By telugu teamFirst Published Jan 24, 2020, 12:49 PM IST
Highlights

టీమిండియాకి ధోనీ అవసరం చాలా ఉందని చెప్పాడు. ధోనీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని చెప్పడం విశేషం. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

టీమిండియా కి మహేంద్ర సింగ్ ధోనీ అవసరం చాలా ఉందని టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా అభిప్రాయపడ్డారు. గతేడాది  ఆగస్టులో మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న సురేష్ రైనా .. అప్పటి నుంచి క్రికెట్ కి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నారు.

కాగా... ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో జట్టులో చోటు దక్కించుకునేందుకు తన వంతు కృషి తాను చేస్తున్నాడు. ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యం అదేనని ఆయన చెప్పారు. కాగా... తాజాగా ఆయన మాజీ కెప్టెన్ ధోనీ భవిష్యత్తుపై కూడా స్పందించడం విశేషం.

Also read సెహ్వాగ్ తలపై ఉన్న జట్టు కన్నా ఎక్కువగా... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియాకి ధోనీ అవసరం చాలా ఉందని చెప్పాడు. ధోనీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని చెప్పడం విశేషం. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఐపీఎల్ 2020 సీజన్ లో అత్యత్తమ ప్రదర్శన కనపరచాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు, మూడు సంవత్సరాలు క్రికెట్ ఆడగలనని తనకు తెలుసునని.. అందుకే ఐపీఎల్ మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అక్టోబర్ లోజరిగే టీ20 వరల్డ్ కప్ రేసులో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 

ధోనీ కూడా ఐపీఎల్ కోసం మార్చి తొలి వారంలో చెన్నైలో నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్ కి హాజరౌతాడని చెప్పారు. టీమిండియాలో తనకు రీఎంట్రీ ఇస్తారా అనే విషయం ఇప్పుడంతా కోహ్లీ చేతుల్లోనే ఉందని చెప్పాడు.

ఇదిలా ఉండగా... గతేడాది వరల్డ్ కప్ తర్వాత ధోనీ మళ్లీ జట్టులోకి అడుగుపెట్టింది లేదు. ఇక రైనా సైతం 2018 జులై లో భారత్ తరపున ఆఖరిగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం వల్ల దూరమయ్యాడు. తిరిగి జట్టులోకి వస్తాడో లేదో తెలియాల్సి ఉంది. 


 

click me!