న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారభించింది. న్యూజిలాండ్ పై జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరలో శ్రేయాస్ అయ్యర్ చేలరేగి ఆడి విజయాన్ని అందించాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. ఆక్లాండ్‌లో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లోకేశ్ రాహుల్ 56, విరాట్ కోహ్లీ 45, శ్రేయస్ అయ్యర్ 58 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌదీ 2, టిక్నర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
undefined
అంతకు ముందు విజయానికి 38 బంతుల్లో 61 పరుగులు కావాల్సిన స్థితిలో భారత్ కొద్దిపరుగుల తేడాతో నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద సోదీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన దూబే.. సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. .
కాగా, 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ... టిక్నర్ బౌలింగ్‌లో గప్టిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దూకుడుగా ఆడిన ఓపెనర్ లోకేశ్ రాహుల్ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సోధీ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా వెనుదిరిగాడు.ప్రారంభం నుంచి ధాటిగా ఆడుతున్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రాహుల్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. సిక్స్ కొట్టి మంచి ఊపులో ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శాంట్నర్ బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
భారత్, న్యూజీలాండ్ ల మధ్య జరిగిన తొలి టి 20లో న్యూజీలాండ్ 203 పరుగుల భారీ స్కోరును సాధించింది.కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్, మన్రో లు అర్థ సెంచరీలను నమోదు చేసారు. వికెట్లను కోల్పోతున్నప్పటికీ న్యూజీలాండ్ జోరు మాత్రం తగ్గకుండా ఆడింది. డిఫరెంట్ షేప్ కలిగి ఉన్న గ్రౌండ్ ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ, ఎటు కొడితే రన్స్ ఎక్కువగా వస్తాయో చూస్తూ.. యాంగిల్స్ ని కరెక్ట్ గా టైం చేస్తూ న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు.
19వ ఓవర్లో షమీ కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల పరుగుల వేగానికి ఒకింత బ్రేక్ పడ్డట్టు అనిపించింది. షమీ బౌలింగ్ కి తోడుగా వరుస వికెట్లను కోల్పోవడం న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ స్థైర్యాన్ని ఒకింత మాత్రం దెబ్బకొట్టినట్టు కనబడింది. 18, 19 ఓవర్లలో కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చారు భారత బౌలర్లు. బుమ్రా, షమీలు చాలా జాగ్రత్తగా బంతులు వేసి వారిని పూర్తిగా కట్టడి చేసారు.
చివరి 20వ ఓవర్ లో బౌలింగ్ వేస్తూ బుమ్రా ఒకింత ఇబ్బందిపడ్డారు. ఆఖరి ఓవర్లో రెండవ బంతిని వేసి రన్ అప్ పూర్తి చేస్తూ ఒక్కసారిగా కూర్చుండిపోయాడు. నొప్పితో విలవిల్లాడుతున్న బుమ్రాను పరీక్షించిన ఫీజియో పర్లేదు అని చెప్పడంతో బౌలింగ్ కొనసాగించాడు. ఆఖ్ఖరు ఓవర్లో మూడవ బంతికి రాస్ టేలర్ తన తొలి టి 20 హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచుకు సంబంధించి టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆక్లాండ్ లోని ఈడెన్‌పార్క్ బ్యాట్స్‌మెన్ స్వర్గధామం. చిన్న బౌండరీల మైదానం. ఎటువంటి బ్యాట్స్‌మెన్ అయినా, హిట్టింగ్ చేయడానికి సాహసించే గ్రౌండ్ ఇది. బౌలర్లు ఎప్పటికప్పుడు లెంగ్త్, లైన్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.
అక్కడి ఉపఉష్ణమండల పరిస్థితుల్లో స్లో, స్పిన్ బౌలర్లకు అనుకూలత ఎక్కువ. ఇరు జట్లు పేసర్లతో పాటు స్పిన్‌పై ఎక్కువగా ఆధారపడనున్నాయి. లక్ష్యాన్ని కాపాడుకోవటం కష్టమైన పని. అందుకోసమే టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ చేసేందుకు డిసైడ్ అయింది. ఇక్కడ ఓవర్‌కు 10కి పైగా పరుగులు రాబట్టడం పెద్ద కష్టమైనా పని కాదు.
ప్లేయింగ్ ఎలెవన్
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, శివం దూబె, రవీంద్ర జడేజా,చాహల్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, శార్ధుల్ ఠాకూర్ .
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హామిష్ బెన్నెట్, బ్లెయిర్ టిక్నర్, టిమ్ సీఫర్ట్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమె, టిమ్ సౌథీ, ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్.