ఎక్స్‌ప్రెషన్లతో ఆట: కోహ్లీ ఒక ఉఫ్.. అయ్యర్ మరొక ఉఫ్

Siva Kodati |  
Published : Jan 09, 2020, 10:03 PM ISTUpdated : Jan 09, 2020, 10:19 PM IST
ఎక్స్‌ప్రెషన్లతో ఆట: కోహ్లీ ఒక ఉఫ్.. అయ్యర్ మరొక ఉఫ్

సారాంశం

టీమిండియా కెప్టెన్ విరాటో కోహ్లీ.. బ్యాట్‌తో ఎలా రెచ్చిపోతాడో... గ్రౌండ్‌లో అసహనం, కోపం, ఆవేశం, ఆనందం ఇలా అన్ని రకాలుగా తన హావభావాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫీల్డ్‌లోనే కాదు గ్యాలరీలోనూ ఓ చోట కూర్చోడు. తాజాగా మంగళవారం ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లో కోహ్లీ హావభావాలు అభిమానులకు నవ్వులు తెప్పించాయి

టీమిండియా కెప్టెన్ విరాటో కోహ్లీ.. బ్యాట్‌తో ఎలా రెచ్చిపోతాడో... గ్రౌండ్‌లో అసహనం, కోపం, ఆవేశం, ఆనందం ఇలా అన్ని రకాలుగా తన హావభావాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫీల్డ్‌లోనే కాదు గ్యాలరీలోనూ ఓ చోట కూర్చోడు.

Also Read:కెప్టెన్ గా కోహ్లీ వరల్డ్ రికార్డు... టీ20ల్లో అరుదైన ఘనత

తాజాగా మంగళవారం ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లో కోహ్లీ హావభావాలు అభిమానులకు నవ్వులు తెప్పించాయి. అసలేం జరిగిందంటే...  లక్ష్యఛేదనలో భాగంగా 17వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ కొట్టిన సిక్స్ 101 మీటర్ల దూరంలో పడింది.

దీనికి ఫిదా అయిన విరాట్ కోహ్లీ.. ‘‘ఉఫ్’’ అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. కెప్టెన్‌నే ఫాలో అయిన శ్రేయస్ అయ్యర్ కూడా ‘ఉఫ్’ అన్నాడు. వారిద్దరి ఎక్స్‌ప్రెషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Also Read:టీ20 ప్రపంచ కప్ 2020: కోహ్లీ సర్ ప్రైజ్ ప్యాకేజీ ఇతనే....

కాగా రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన భారత్... 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ 45, శిఖర్ ధావన్ 32 పరుగులు చేసి శుభారంభం చేశారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఫినిషింగ్ షాట్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 లో బిగ్ ట్విస్ట్.. పాకిస్థాన్ ప్లేస్‌లో ఆ టీమ్ వస్తే రచ్చ రచ్చే !
T20 World Cup 2026 : రూ. 220 కోట్లు గోవిందా.. బంగ్లాదేశ్ కు ఐసీసీ బిగ్ షాక్