కెప్టెన్ గా కోహ్లీ వరల్డ్ రికార్డు... టీ20ల్లో అరుదైన ఘనత

Published : Jan 09, 2020, 02:14 PM IST
కెప్టెన్ గా కోహ్లీ వరల్డ్ రికార్డు... టీ20ల్లో అరుదైన ఘనత

సారాంశం

శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు. అయితే, రెండో టీ20లో కోహ్లీ 17 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేశాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది. కెప్టెన్ గా ఆయన మరో రికార్డును సొంత చేసుకున్నాడు. ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఈ మ్యాచ్ లోనే కోహ్లీ వరల్డ్ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు అందుకున్న కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక పేసర్ లిసత్ మలింగ బౌలింగ్‌లో సింగిల్‌ తీయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

AlsoRead టీ20 ప్రపంచ కప్ 2020: ధోనీ వేస్ట్, వీవీఎస్ లక్ష్మణ్ జట్టు ఇదే.

శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు. అయితే, రెండో టీ20లో కోహ్లీ 17 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేశాడు. కాగా, ఈ జాబితాలో ధోని 62 మ్యాచ్‌ల్లో 1112 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అంతేకాదు కోహ్లీ కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో పాటు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన అటగాడిగా తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను కూడా కోహ్లీ అధిగమించాడు. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ