అత్యాచార కేసులో దోషిగా తేలిన ఐపీఎల్ ప్లేయర్..
Sandeep Lamichhane Rape Convict: 18 ఏళ్ల అమ్మాయి పై అత్యాచార కేసులో ఐపీఎల్ ప్లేయర్, నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానే దోషిగా తేలాడు. తదుపపరి విచారణలో అతనికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.
Sandeep Lamichhane: ఐపీఎల్ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచానే అత్యాచారానికి పాల్పడ్డాడు. 18 ఏళ్ల అమ్మాయి పై అత్యాచార కేసులో అతను దోషిగా తేలాడు. ఖాట్మండు జిల్లా కోర్టు శుక్రవారం సందీప్ లామిచానేపై తుది తీర్పు వెలువరించింది. ఆదివారం ప్రారంభమైన తుది విచారణ ముగియడంతో జస్టిస్ శిశిర్ రాజ్ ధాకల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అత్యాచారం జరిగిన సమయంలో బాలిక మైనర్ కాదని కోర్టు తేల్చింది.
ఖాట్మండు పోస్ట్ ప్రకారం, ఈ సీనియర్ జాతీయ జట్టు ఆటగాడికి జైలు శిక్షను తదుపరి విచారణలో నిర్ణయిస్తారు. సందీప్ లమిచానే ఎన్ని రోజులు జైలు శిక్షను విధించనుందనేది తెలుస్తుందని పేర్కొంది. లామిచానే ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. జనవరి 12న పటాన్ హైకోర్టు క్రికెటర్ ను విడుదల చేయాలని ఆదేశించింది. లామిచానే రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. షరతులతో రూ.20 లక్షల పూచీకత్తుపై బెయిల్ పై ఉన్నాడు.
Team India: టీమిండియాకు ఐసీసీ షాక్.. భారీ జరిమానాతో పాటు..
నిర్బంధ విచారణ అనంతరం లామిచానేను సుంధారలోని సెంట్రల్ జైలుకు పంపాలని ఖాట్మండు జిల్లా కోర్టు 2022 నవంబర్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ లామిచానే హైకోర్టును ఆశ్రయించారు. 22 ఏళ్ల క్రికెటర్ పై బాలిక సెప్టెంబర్ 6న గోశాలలోని మెట్రోపాలిటన్ పోలీస్ సర్కిల్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో బాలిక మైనర్ అని చెప్పినా కోర్టు గుర్తించలేదు.
సందీప్ లామిచానేపై కేసు నమోదైన సమయంలో అతను కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటే సీపీఎల్ లో ఆడేందుకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్నాడు. అక్టోబర్ 6న త్రిభువన్ విమానాశ్రయంలో నేపాల్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బాధితురాలిని శారీరకంగా, మానసికంగా హింసించినందుకు లామిచానే నుంచి నష్టపరిహారం చెల్లించాలని చార్జిషీట్ ద్వారా జిల్లా న్యాయవాది కోరారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత లామిచానే బ్యాంకు ఖాతాలు, ఆస్తులను స్తంభింపజేశారు.
`డెవిల్` డైరెక్టర్ వివాదం వెనుక అసలు కథ ఇదే?.. కళ్యాణ్ రామ్ ఈగో దెబ్బతిన్నదా?..ప్రొడ్యూసర్