IND vs SA: సచిన్ టెండూల్కర్ భారీ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ మిస్సైన విరాట్ కోహ్లీ.. !

By Mahesh Rajamoni  |  First Published Dec 21, 2023, 2:56 PM IST

Virat Kohli-Sachin Tendulkar: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా గురువారం (డిసెంబర్ 21) మూడో, ఈ సిరీస్‌‌లో చివరి వన్డే ఆడనుంది. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మిస్సవుతున్నప్పటికీ సిరీస్ 1-1తో సమమైంది. ఈ సిరీస్ లో కోహ్లీ ఉండివుంటే టెండూల్క‌ర్ మ‌రో రికార్డును బద్ద‌లు కొట్టి వుంటేవాడు.


India vs South Africa: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.  వన్డే సిరీస్ లోని మూడో మ్యాచ్ పార్ల్ లోని బోలాండ్ పార్క్ లో జ‌రిగే మ్యాచ్ ను గెల‌వాల‌ని ఇరు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో యంగ్ ప్లేయ‌ర్ల‌తో ఉన్న భారత జట్టు సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ సిరీస్ కు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేయడంతో సీనియ‌ర్ ఆట‌గాళ్లు దూరంగా ఉన్నారు.

అయితే, ఈ సిరీస్ కు దూరంగా కింగ్ విరాట్ కోహ్లీ.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉన్న మ‌రో రికార్డును బ‌ద్ద‌లు కొట్టే ఛాన్స్ మిస్స‌వ‌తున్నాడు.  స‌చిన్ తన కెరీర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ఐదు సెంచరీలు సాధించగా, 57 మ్యాచ్ ల‌లో 5 సెంచరీలు, 8 అర్ధసెంచరీలతో 2001 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లీ 29 ఇన్నింగ్స్ ల‌లో 65.39 సగటుతో 5 సెంచరీలు, 8 అర్ధసెంచరీలతో 1504 పరుగులు చేశాడు.

Latest Videos

undefined

సచిన్ టెండూల్కర్ 14 ఏండ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన బంగ్లా ప్లేయ‌ర్..

వన్డేల్లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున కోహ్లీ, సచిన్ ఇద్దరూ సంయుక్తంగా అత్యధిక సెంచరీలు సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆడి ఉంటే టెండూల్కర్ ను అధిగమించి ప్రొటీస్ పై 50 ఓవర్ల ఫార్మాట్ లో భారత్ నుంచి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉండేది. ఓవరాల్ గా ఏబీ డివిలియర్స్, క్వింటన్ డికాక్లు భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ ల‌లో అత్యధిక సెంచరీలు (6 చొప్పున) చేశారు. ఈ సిరీస్ ఆడి, సెంచ‌రీతో రాణించి వుంటే కోహ్లీ కూడా వారి స‌ర‌స‌న చేరి వుండేవాడు.

ఏదేమైనా, డిసెంబర్ 26 నుండి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ ల‌ టెస్ట్ సిరీస్ లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నెల రోజుల తర్వాత తిరిగి టీమిండియా త‌ర‌ఫున‌ బరిలోకి దిగనున్నాడు. గత నెలలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ లో మ‌రిన్ని రికార్డులు నెల‌కొల్ప‌డంతో పాటు సౌతాఫ్రికాలో భారత్ కు తొలి టెస్టు సిరీస్ గెలవ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

IND Vs SA: కీల‌క‌పోరు.. భారత్‌, దక్షిణాఫ్రికా మూడో వన్డే.. టీంలోకి కొత్త ప్లేయ‌ర్

click me!