IND vs SA: ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాపై మాజీ ఓపెన‌ర్ సంచలన వ్యాఖ్యలు

By Mahesh Rajamoni  |  First Published Dec 27, 2023, 2:18 PM IST

Temba Bavuma: సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్-ద‌క్షిణాఫ్రికా తొలి టెస్టులో మొదటి రోజు విరాట్ కోహ్లి బౌండరీని ఆపే ప్రయత్నంలో స‌ఫారీ సార‌థి టెంబా బావుమా గాయ‌ప‌డ్డాడు. అయితే, అత‌న్ని ఇంకా ఎందుకు ఆడిస్తున్నార‌ని సౌతాఫ్రికా మాజీ ఓపెన‌ర్ హెర్షెల్ గిబ్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.  
 


South Africa captain Temba Bavuma: సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మంగళవారం ప్రారంభం అయిన‌ తొలి టెస్టు మ్యాచ్ లో స‌ఫారీ సార‌థి టెంబా బావుమా గాయ‌ప‌డ్డాడు. అయితే, సౌతాఫ్రికా మాజీ ఒపెన‌ర్ హెర్షెల్ గిబ్స్  చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. టెంబా బావుమాను ఎందుకు ఇంకా ఆడిస్తున్నార‌ని ప్ర‌శ్నించిన గిబ్స్.. గేట్ ఆడ‌టానికి అత‌ను అనర్హుడనీ, అధిక బరువుతో ఫిట్ గా లేడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

భారత్ తో బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని ఆపడానికి ప్రయత్నించిన బవుమా ఎడమ తొడ కండరాలకు గాయమై గ్రౌండ్ ను వీడాడు. తన టెస్టు కెరీర్ లో చివరి సిరీస్ ఆడుతున్న వెటరన్ బ్యాట్స్ మన్ డీన్ ఎలార్ బవుమా గైర్హాజరీలో కెప్టెన్ గా బరిలోకి దిగాడు.

Latest Videos

20వ ఓవర్ లో మార్కో జాన్సెన్ వేసిన ఫుల్ డెలివరీని కోహ్లీ ఎక్స్ట్రా కవర్ ద్వారా డ్రైవ్ చేయగా, ఆ బాల్ ను ఆపేందుకు చేసిన ప్ర‌య‌త్నంలో ఎంబావుమా గాయ‌ప‌డ్డాడు. అయితే, అత‌ని ఫిట్ నెస్ పై అనుమానాలు వ్య‌క్తం చేసిన దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్ మన్ హెర్షల్ గిబ్స్ ప్రొటీస్ కెప్టెన్ ను గేమ్ ఆడ‌టానికి అనర్హుడనీ, అధిక బరువుతో ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. "2009 లో ప్రోటీస్ ట్రైనర్ గా ప్రారంభించినప్పుడు కోచ్ స్పష్టంగా అనర్హులు, అధిక బరువు ఉన్న కొంతమంది ఆటగాళ్లను ఆడటానికి అనుమతించడం విడ్డూరంగా ఉంది" అని గిబ్స్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

 

🚨 UPDATE ON BAVUMA 🚨

The scans have reveal a left hamstring strain and he will undergo daily medical evaluations to determine his participation in the match pic.twitter.com/XHFwnlguEY

— Werner (@Werries_)

 

బవుమాను స్కానింగ్ కోసం పంపగా, కామెంటేటర్లు అతను ఎడమ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. అతనికి వైద్య పరీక్షలు కొనసాగుతాయని, టెస్టులో అతను పాల్గొనడం గురించి త్వ‌ర‌లోనే నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో భారత్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో బవుమా కుడి తొడ కండరాల గాయంతో ఆడాడు.

IND VS SA: రోహిత్, కోహ్లీలను ఔట్ చేసి.. భారత్ ను దెబ్బకొట్టిన క‌సిగో ర‌బాడ రియాక్ష‌న్ ఇదే..

click me!