'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ను నిర్ణ‌యించాల్సింది కామెంటేటర్లు కాదు.. : గౌత‌మ్ గంభీర్

Published : Dec 27, 2023, 10:47 AM IST
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ను నిర్ణ‌యించాల్సింది కామెంటేటర్లు కాదు.. : గౌత‌మ్ గంభీర్

సారాంశం

Gautam Gambhir: 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ను ఎంపిక గురించి భార‌త మాజీ స్టార్ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను నిర్ణ‌యించాల్సింది కామెంటేటర్లు కాదని పేర్కొన్నాడు.  

Gambhir's comments on player of the match: భార‌త  క్రికెట్ మాజీ స్టార్ ప్లేయ‌ర్ గౌత‌మ్ గంభీర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను నిర్ణ‌యించాల్సింది కామెంటేటర్లు కాదని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను నిర్ణ‌యించాల్సింది జ‌ట్టు కెప్టెన్, కోచ్  ఉండాల‌ని పేర్కొన్నాడు. ఎందుకంటే, కామెంటేట‌ర్లు ప‌క్ష‌పాతంగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నాడు. తాను కూడా ఒక కామెంటేట‌ర్ నే అంటూ చెప్పారు.

"కామెంటేటర్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను నిర్ణయించకూడదు. నేను కూడా కామెంటేటర్ ను. కామెంటేట‌ర్లు పక్షపాతంగా ఉండవచ్చు. కాబ‌ట్టి దానిని ఆపాలి. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ను జట్టు కోచ్ లేదా కెప్టెన్ ఎంచుకోవాలి" అని గంభీర్ అన్న‌ట్టు స్పోర్ట్స్ కీడా నివేదించింది.

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఎంపిక ఎలా చేస్తారు? 

క్రికెట్ లో సాధారణంగా మాజీ ఆటగాళ్లు, కామెంటేటర్లతో సహా నిపుణుల కమిటీ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'ను ఎంపిక చేస్తుంది. వారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఆటపై మొత్తం ప్రభావంతో సహా మ్యాచ్ అంతటా ఆటగాడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారు. చేసిన పరుగుల సంఖ్య, తీసిన వికెట్లు, ప‌ట్టుకున్న క్యాచ్లు, మ్యాచ్ ఫలితంపై ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆటకు అత్యంత ముఖ్యమైన సహకారం అందించిన ఆటగాడిని గుర్తించడం లక్ష్యంగా, వారిని ప్రోత్స‌హించ‌డం వంటి ల‌క్ష్యాల‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఇస్తున్నారు.

 

 

IND VS SA: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?