భారత్-పాక్ మ్యాచ్ కి ఊర్వశీ రౌతలా.. రిషబ్ పంత్ కోసమేనా..?

By telugu news teamFirst Published Oct 25, 2021, 12:21 PM IST
Highlights

రిషభ్ పంత్(Rishabh pant) ఆడుతున్నప్పుడు ఆమె మరింత   ఉత్సాహంగా కనిపించడం గమనార్హం. రిషభ్ పంత్ సిక్సర్లు, బౌండరీలను ఎంజాయ్ చేశారు. జాతీయ జెండాను ఊపుతూ పంత్‌ను ఎంకరేజ్ చేశారు.

T20 world cup లో భాగంగా  ఆదివారం భారత్-పాక్ మ్యాచ్ లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ పది వికెట్ల తేడాతో పరాజయం చవి చూసింది. ఈ మ్యాచ్ సంగతి పక్కన పెడితే..  స్టేడియంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దాయాది దేశాలు రెండేళ్ల తర్వాత తొలిసారిగా తలపడుతుండటంలో ఈ టీ20 మ్యాచ్‌పై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ను నేరుగా వీక్షించిన ఊర్వశి రౌతేలా.. కేవలం రిషభ్ పంత్ కోసమే ఆమె  అక్కడకు వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి.

రిషభ్ పంత్(Rishabh pant) ఆడుతున్నప్పుడు ఆమె మరింత   ఉత్సాహంగా కనిపించడం గమనార్హం. రిషభ్ పంత్ సిక్సర్లు, బౌండరీలను ఎంజాయ్ చేశారు. జాతీయ జెండాను ఊపుతూ పంత్‌ను ఎంకరేజ్ చేశారు.

గతంలో(2018లో) వీరిద్దరు డేటింగ్(Dating) చేస్తున్నట్లు ప్రచారం జరగడం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఊర్వశి రౌతేలాను వాట్సప్‌లో రిషభ్ పంత్ బ్లాక్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆటపై ఫోకస్ పెట్టేందుకే రౌతేలా నుంచి పంత్ దూరం జరిగినట్లు ప్రచారం జరిగింది. అక్టోబర్ 4న పంత్ జన్మదినాన్ని జరుపుకోగా.. రౌతేలా బర్త్ డే విషెస్ తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య ఇంకా ఏదో నడుస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.

Also Read: T20 Worldcup: ఒక గండం గడిచింది.. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.. భారత్ పై విజయానంతరం పాక్ కెప్టెన్

ఈ మ్యాచ్ కి కూడా ఊర్శశీ రౌతలా.. కేవలం పంత్ కోసమే వచ్చిందని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం.. అటెన్షన్ కోసం వచ్చి ఉండచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

Also read: Ind vs paK: ఇదేమీ చివరి మ్యాచ్ కాదు కదా.. ఓటమిపై విరాట్ కోహ్లీ..!

ఆమె స్టేడియంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మ్యాచ్ ఓడినా.. ఊర్వశి కారణంగా.. పంత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. 

ఇప్పుడు మరోసారి ఆమె దుబాయ్(Dubai) స్టేడియంలో నేరుగా మ్యాచ్‌ను వీక్షించడం, పంత్‌ ఆటను ఎంజాయ్ చేయడం మీడియాను ఆకట్టుకుంది. అటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా స్టేడియంలో కనిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు నష్టానికి 151 పరుగులు చేసింది. కోహ్లీ(Kohli) ఆఫ్ సెంచరీతో సత్తా చాటగా...పంత్ 39 పరుగుల చేసి ఆకట్టుకున్నాడు.

click me!