Ind vs paK: ఇదేమీ చివరి మ్యాచ్ కాదు కదా.. ఓటమిపై విరాట్ కోహ్లీ..!

By telugu news teamFirst Published Oct 25, 2021, 11:22 AM IST
Highlights

 ఈ సారి విజయం తమదే అనే ధీమాతో మైదానంలోకి అడుగుపెట్టింది. కానీ వారి ప్లాన్స్ ని పాక్ జట్టు బోల్తా కొట్టించింది.భారత్ ని పాక్ ఓడించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.


T20 world cup లో భాగంగా ఆదివారం.. టీమిండియా పాకిస్తాన్ తో తలపడిన సంగతి తెలిసిందే.  అయితే.. తొలిసారి.. ప్రపంచకప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.  పది వికెట్ల తేడాతో టీమిండియాను పాక్ చిత్తు చిత్తుగా ఓడించడం గమనార్హం.  పాకిస్తాన్ పై గతంలో టీమిండియా ఐదుసార్లు విజయం సాధించింది. ఈ సారి విజయం తమదే అనే ధీమాతో మైదానంలోకి అడుగుపెట్టింది. కానీ వారి ప్లాన్స్ ని పాక్ జట్టు బోల్తా కొట్టించింది.భారత్ ని పాక్ ఓడించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Also Read: T20 Worldcup: మరేంచేయాలి.. రోహిత్ శర్మను జట్టు నుంచి తీసేయమంటారా..? విరాట్ కోహ్లి ఘాటు వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో భారత్‌ ఓటమిని అంగీకరించక తప్పలేదు. 10 వికెట్ల తేడాతో భారత్‌ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించి పాకిస్థాన్‌ సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఇదిలా ఉంటే మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఫలితంపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది టోర్నీకి కేవలం ప్రారంభమేనని.. ముగింపు కాదు అని కోహ్లీ పేర్కొన్నాడు.

Also Read: Ind vs pak: హార్దిక్ పాండ్యా భుజానికి గాయం.. స్కానింగ్ కి వెళ్లిన ఆల్ రౌండర్..!

మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌ జట్టు ఈ రోజు ఆడిన విధానం బాగుంది. మొదట బంతితో శుభారంభించారు. మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లోకి వెళ్లాము. మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయలేకపోయాం. తొలుత నెమ్మదిగా మొదలుపెట్టి.. తిరిగి పుంజుకోవడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఇంకో 20 పరుగులు అదనంగా వచ్చి ఉంటే బాగుండేది. కానీ పాకిస్థాన్‌ బౌలర్లు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు.’

‘పాకిస్థాన్‌ను ఆరంభంలోనే వికెట్లు తీయాల్సింది కానీ వాళ్లు మంచి బ్యాటింగ్‌ తీరును కనబరిచారు. అయితే, మా బలాబలాలేమిటో మాకు తెలుసు. స్లో బౌలర్‌ లేకపోవడం లోటు అనడానికి అంతగా ఆస్కారం లేదు. డ్యూ ఉన్నపుడు వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేరు. అయినా టోర్నమెంట్‌లో ఇది మొదటి మ్యాచ్‌… చివరిదైతే కాదు కదా’ అని చెప్పుకొచ్చాడు. ఇలా కోహ్లీ ఓటమిని హుందాగా ఒప్పుకుంటూనే భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌ల్లో రాణిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు.

click me!