చివరి టీ20, నరాలు తెగే ఉత్కంఠ: పక్కపక్కనే కూర్చొన్న కోహ్లీ, విలియమ్సన్

By Siva KodatiFirst Published Feb 2, 2020, 5:53 PM IST
Highlights

కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండర్-19 జరిగే రోజుల నుంచి మంచి మిత్రులు. జాతీయ జట్లకు ఇద్దరు కెప్టెన్లుగా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా వారి స్నేహం అలాగే కొనసాగుతోంది

కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండర్-19 జరిగే రోజుల నుంచి మంచి మిత్రులు. జాతీయ జట్లకు ఇద్దరు కెప్టెన్లుగా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా వారి స్నేహం అలాగే కొనసాగుతోంది.

Also Read:ఐదో టీ20: అదే ఉత్కంఠ.. కివీస్‌పై భారత్‌దే విజయం, సిరీస్ క్లీన్ స్వీప్

మైదానంలో ఇద్దరు విజయం కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచించినా స్నేహం దగ్గరికి వచ్చే కొద్ది ఇద్దరు ఒకటే. తాజాగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో వీరిద్దరు పక్కపక్కన కూర్చొన్నారు.

సాధారణంగా మ్యాచ్ జరిగే సమయాల్లో ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు పక్కపక్కన ఉండరన్న సంగతి తెలిసిందే. అటువంటిది విలియమ్సన్, కోహ్లీలు పక్కపక్కన కూర్చోవడం ఆసక్తి రేపింది. వీరిద్దరూ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకున్నారు.

చివరి టీ20 సందర్భంగా కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీకి వారి జట్ల యాజమాన్యాలు విశ్రాంతిని ఇచ్చాయి. కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. కేన్ మాత్రం భుజం గాయం కారణంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫలితంగా వీరిద్దరూ కలిసి మ్యాచ్‌ను వీక్షించే అవకాశం దొరికింది.

Also Read:పంత్ ను అలాగే చేస్తారా: ధోనీపై నిప్పులు చెరిగిన సెహ్వాగ్

మరోవైపు చివరి టీ20లో సైతం భారత్ విజయం సాధించి సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 163 పరుగులు చేయగా, అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయడంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

click me!