చివరి టీ20: న్యూజిలాండ్‌ విజయలక్ష్యం 164

By Siva KodatiFirst Published Feb 2, 2020, 2:28 PM IST
Highlights

భారత్-న్యూజిలాండ్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనుయ్‌లో జరుగుతున్న చివరి టీ20లో కివీస్ ముందు భారత్ 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

భారత్-న్యూజిలాండ్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనుయ్‌లో జరుగుతున్న చివరి టీ20లో కివీస్ ముందు భారత్ 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంతసన్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుగులీన్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ 60, కేఎల్ రాహుల్‌ 45తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

వీరిద్దరూ చూడచక్కని షాట్లతో కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను 12వ ఓవర్‌లో బెన్నెట్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవలియన్ చేరాడు.

ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధాటిగా ఆడిన రోహిత్ శర్మ కాలికి గాయం కావడంతో అతను రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే 5 కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.

చివర్లో మనీశ్ పాండేతో కలిసి శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఓవర్లు అయిపోయాయి. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో కుగేలిన్ 2, బెన్నెట్ ఒక వికెట్ పడగొట్టారు. 

click me!