Ind Vs NZ: న్యూజిలాండ్ కు దెబ్బ మీద దెబ్బ.. ఇండియాతో సిరీస్ కు మరో స్టార్ ఆటగాడు దూరం.. అసలేం జరుగుతోంది.?

By team teluguFirst Published Nov 17, 2021, 12:45 PM IST
Highlights

India Vs New Zealand: న్యూజిలాండ్ కు ఏమైంది..? మొన్న డెవాన్ కాన్వే.. నిన్న కేన్ మామ.. నేడు మరో ఫాస్ట్ బౌలర్. ఇలా రోజుకో ఆటగాడు విశ్రాంతి పేరిట సిరీస్ నుంచి తప్పుకుంటున్నారు. ఇది నిజంగా విశ్రాంతా..? లేక గాయాలు కివీస్ ను వేధిస్తున్నాయా..?

మొన్న డెవాన్ కాన్వే.. నిన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్.. నేడు కైల్ జెమీసన్.. అసలు న్యూజిలాండ్ కు ఏమైంది. టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత కాస్త విరామం కూడా లేకుండానే ఇండియాకు వచ్చిన కివీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా సిరీస్ నుంచి తప్పుకుంటుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. T20 World cup లో ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో గాయపడిన డావెన్ కాన్వే.. ఇండియాతో టీ20 సిరీస్ తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగే టెస్టు సిరీస్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.  నిన్న కేన్ మామ కూడా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇక నేడు ఆ జట్టు పేసర్ Kyle Jamieson కూడా మూడు టీ20లకు దూరమవ్వనున్నాడు. 

ఇదే విషయమై ఆ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. ‘కెప్టెన్ Kane Williamson, జెమీసన్ తో మాట్లాడిన తర్వాత.. రాబోయే టెస్టు సిరీస్ కోసం వారిద్ధరికీ విశ్రాంతినివ్వాలని నిర్ణయించాం. టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న మరికొందరు యువ ఆటగాళ్లు కూడా టీ20 సిరీస్ కు దూరమయ్యే  అవకాశముంది. వెంట వెంటనే కీలక సిరీస్ లు ఉండటంతో ఇలా చేయకతప్పడం లేదు..’ అని అన్నాడు. 

అయితే  కీలక సిరీస్ లకు ముందు  కీ ప్లేయర్లంతా విరామాలు తీసుకుంటుండం వెనుక గాయాల బెడదే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారత్ మాదిరే తీరిక లేని  క్రికెట్ ఆడుతున్న కివీస్ ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. విలియమ్సన్ మోచేయి నొప్పితో బాధపడుతున్నాడు. జెమీసన్ కూడా ఐపీఎల్ కు ముందు గాయపడ్డాడు. కాన్వే కు మొన్నటి ఇంగ్లాండ్ మ్యాచ్ లో గాయమైంది. బౌల్ట్, సౌథీ కూడా విరామం లేని క్రికెట్ ఆడుతున్నారు. వారికి కూడా విశ్రాంతి కోరుతున్నారు. కాగా ఈ సిరీస్ ముగిసేలోపు ఇంకెంత మంది కివీస్ ఆటగాళ్లు విరామాల పేరిట తప్పుకుంటారో అని సామాజిక మాధ్యమాలలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.  

Indiaతో New Zealand.. నేడు జైపూర్ లో తొలి టీ20 ఆడనున్నది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ మొదలుకానున్నది. ఈ  మ్యాచ్ తర్వాత 19న రాంచీలో.. 21న కోల్కతా లో మరో రెండు టీ20 ఆడాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ కాన్వేతో పాటు కెప్టెన్ కేన్ మామ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే. కాగా ఇప్పుడు జెమీసన్ కూడా విశ్రాంతి తీసుకోనుండటంతో కివీస్..  స్వదేశంలో ఇండియాను ఆ జట్టు ఏ మేరకు నిలువరిస్తుందనేది ప్రశ్నార్థకమే.. 

టెస్టు సిరీస్ కోసం కివీస్ జట్టు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ విశ్రాంతి తీసుకోనున్నాడు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్, ఇండియాతో టీ20 సిరీస్.. ఇలా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న బౌల్ట్.. టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి కోరాడు. దీంతో జెమీసన్ తప్పక ఉండాల్సిన పరిస్థితి. అయితే 2021 ఐపీఎల్ తొలి దశకు ముందు గాయం నుంచి కోలుకున్న అతడు.. అందులో పెద్దగా రాణించలేదు. రెండో దశలో కూడా వికెట్లేమీ తీయలేదు. ఇక భారత్ లో స్పిన్ పిచ్ లపై అతడు మ్యచ్ ప్రాక్టీస్ లేకుండా ఏమాత్రం ప్రభావం చూపుతాడో వేచి చూడాలి. 

భారత్ తో టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు : మార్టిన్ గప్తిల్, ఆడమ్ మిల్నె, డరిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ (కెప్టెన్), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్,  లాకీ ఫెర్గూసన్

click me!