IND vs IRE : రోహిత్ శ‌ర్మ ధ‌నాధ‌న్ బ్యాటింగ్.. అద‌ర‌గొట్టిన బౌల‌ర్లు.. ఐర్లాండ్ పై భార‌త్ గెలుపు

By Mahesh Rajamoni  |  First Published Jun 5, 2024, 11:19 PM IST

IND vs IRE: టీ20 ప్రపంచకప్ 2024ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఐర్లాండ్ ఆట‌గాళ్ల‌కు చుక్క‌లు చూపించారు. ఇక బ్యాటింగ్ తో రోహిత్ శర్మ ఐర్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేయ‌డంతో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. 
 


T20 World Cup 2024, IND vs IRE: ఆరంభం అదిరిపోయేలా ప్రారంభించింది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐర్లాండ్ ను చిత్తుచేసి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో విజ‌యంతో త‌న ప్ర‌యాణం ప్రారంభించింది. ఈ  మ్యాచ్‌లో భారత పేసర్లు ఐర్లాండ్ ఆట‌గాళ్ల‌కు చుక్క‌లు చూపించారు. ఇక బ్యాటింగ్ తో రోహిత్ శర్మ ఐర్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేయ‌డంతో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. 8 వికెట్ల తేడాతో రోహిత్ సేన మెగా టోర్నీలో త‌న తొలి విజ‌యాన్ని అందుకుంది.

అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా జ‌రుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భార‌త్ త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ ను ఇండియ‌న్ బౌల‌ర్లు చెడుగుడు ఆడుకున్నారు. అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇటీవ‌ల త‌న పేల‌వ‌ ఫామ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు ఏదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 వార్మ‌ప్ మ్యాచ్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, మెగా టోర్నీ తొలి మ్యాచ్ లోనూ దుమ్మురేపే బౌలింగ్ చేశాడు. కీల‌క‌మైన 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, బుమ్రా 2, అక్ష‌ర్ ప‌టేల్ 1, సిరాజ్ 1 వికెట్ తీసుకున్నారు. దీంతో ఐర్లాండ్ 16 ఓవ‌ర్ల‌లోనే 96 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది.

Latest Videos

undefined

97 ప‌రుగుల ఈజీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ గా వ‌చ్చిన విరాట్ కోహ్లీ బిగ్ షాట్ ఆడ‌బోయే క‌నెక్ష‌న్ కుద‌ర‌క‌పోవ‌డంతో బౌండ‌రీ లైన్ వ‌ద్ద‌ క్యాచ్ రూపంలో దొరికొపోయాడు. మ‌రో ఎండ్ లో ఉన్న రోహిత్ శ‌ర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. రిషబ్ పంత్ తో క‌లిసి టీమిండియాను గెలుపు దిశ‌గా ముందుకు న‌డిపించాడు. రోహిత్ శర్మ కేవలం 37 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ వ‌ర్మ రిటైర్డ్ హర్ట్ అయిన త‌ర్వాత సూర్య‌కుమార్ యాద‌వ్ తో క‌లిసి టీమిండియాకు గెలుపును అందించాడు పంత్. రిష‌బ్ పంత్ 36 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ 2 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. 12.2 ఓవ‌ర్ల‌లో టీమిండియా విజ‌యాన్ని అందుకుని ఈ ప్ర‌పంచ క‌ప్ లో తొలి విజ‌యాన్ని అందుకుంది.

 

An all-round display from India in New York earns them two valuable 2024 points 👏 | 📝: https://t.co/U6miLyGgBf pic.twitter.com/Rl4oex1C2N

— ICC (@ICC)

 

IND VS IRE : హార్దిక్ పాండ్యా దెబ్బ‌కు ఎగిరిప‌డ్డ వికెట్లు ..

click me!