భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్: హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ట్రాక్ రికార్డు ఇదీ..

By narsimha lode  |  First Published Jan 24, 2024, 6:36 PM IST

హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో  భారత క్రికెట్ జట్టుకు మంచి  రికార్డు ఉంది.  రేపటి నుండి ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య  టెస్ట్ మ్యాచ్ జరగనుంది.



హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో  ఈ నెల  25వ తేదీన ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్  కోసం అభిమానులు  ఎదురు చూస్తున్నారు.

ఈ నెల  25న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్  జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2010 నుండి 2018 వరకు  మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ లకు  హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం  ఆతిథ్యం ఇచ్చింది.  అస్ట్రేలియా, బంగ్లాదేశ్ లతో  ఒక్కో న్యూజిలాండ్, వెస్టీండీస్ జట్లతో   ఈ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఐదు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లలో  భారత జట్టు విజయం సాధించింది.

Latest Videos

2010లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్  డ్రాగా ముగిసింది.  2012లో  రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్  భారత్ పై  115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.అస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టీండీస్ లపై అద్భుతమైన విజయాలను సాధించింది.  స్వంత గడ్డపై  భారతదేశం ఆధిపత్యాన్ని సాధించింది.

హైద్రాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం లో తొలి ఇన్నింగ్స్ సగటు 405గా గణాంకాలు చెబుతున్నాయి.తొలిసారి బ్యాటింగ్ చేసిన జట్టు, రెండో దఫా బ్యాటింగ్  ప్రారంభించిన జట్టు చెరో రెండు మ్యాచ్ లలో విజయాలు సాధించినట్టుగా  గణాంకాలు చెబుతున్నాయి.టెస్ట్ మ్యాచ్ లో  టాస్ గెలవడమే కీలకం.ఈ స్టేడియంలో విజయం సాధించిన జట్లు  టాస్ గెలిచాయి.  

2017లో  బంగ్లాదేశ్ పై భారత్ ఆరు వికెట్లు కోల్పోయి  687 పరుగులు చేసింది.2018లో వెస్టిండీస్ జట్టు  127 పరుగులు చేయడం  ఈ స్టేడియంలో అత్యల్ప స్కోర్. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు గత 12 ఏళ్లుగా స్వంత మైదానంలో టెస్ట్ సిరీస్ లో ఓటమిని చూడని అద్భుత రికార్డు కలిగి ఉంది. 
  విశాఖపట్టణం, రాజ్ కోట్ , రాంచీ, ధర్మశాలలో కూడ మిగిలిన టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి.   

click me!