Sunil Gavaskar: కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయిన గవాస్కర్.. అసలేం జరిగింది?

Published : Feb 03, 2024, 03:12 AM IST
Sunil Gavaskar: కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయిన గవాస్కర్.. అసలేం జరిగింది?

సారాంశం

Sunil Gavaskar: వైజాగ్ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కామెంట్రీ చేస్తున్నాడు. అయితే.. ఆయన సడెన్ గా చేస్తున్న కామెంట్రీని మధ్యలోనే విడిచి పెట్టి పోయాడు. ఆ వెంటనే  విశాఖపట్నం నుంచి కాన్పూర్‌కు బయలుదేరారు. ఇలా హుఠాహూటిన వెళ్లిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగింది.? 

Sunil Gavaskar: భారత్ - ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 179 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన షోయబ్ బషీర్ అద్భుతంగా రాణించాడు. తొలి మ్యాచ్ లోనే  రెండు వికెట్లు తీశాడు.

కాగా.. ఈ మ్యాచ్ కు వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ కామెంట్రీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ విషాదకర వార్త తెలియడంతో కామెంట్రీని మధ్యలోనే విడిచి పెట్టిపోయాడు. ఆ వెంటనే  విశాఖపట్నం నుంచి కాన్పూర్‌కు బయలుదేరారు. ఇలా హుటాహూటిన వెళ్లిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. పలు నివేదికల ప్రకారం.. భారత గ్రేట్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అత్తగారి మరణ వార్తను అందుకున్నాడు.

దీంతో అతను తన కామెంట్రీని మధ్యలోనే వదిలి విశాఖపట్నం నుండి కాన్పూర్‌కు వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం సునీల్ గవాస్కర్ తన భార్య మార్ష్నీల్ గవాస్కర్, తన కుటుంబంతో కలిసి కాన్పూర్‌కు బయలుదేరారు. గవాస్కర్ భారతదేశపు సీనియర్ పురుషుల క్రికెట్ సిరీస్‌కు అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలు,విశ్లేషకులలో ఒకరు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ల కామెంట్రీ ప్యానెల్‌లో మాజీ కెప్టెన్ సభ్యుడు.

కామెంట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు
 
సునీల్ గవర్కర్ భారతదేశం తరపున 125 టెస్ట్ మ్యాచ్‌లతో పాటు  108 ODI మ్యాచ్ లు ఆడి .. 13 వేలకు పైగా పరుగులు చేశాడు.  క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత అతను కామెంట్రేటర్ గా కొత్త కెరీర్ ను ప్రారంభించారు. అలాగే.. గతంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !