IND Vs ENG :  సాగరతీరాన.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన టీమిండియా క్రికెటర్స్!

By Rajesh KarampooriFirst Published Feb 2, 2024, 10:29 PM IST
Highlights

IND Vs ENG 2nd Test : విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసిన తరువాత ఓ ఆస్తకికర పరిణామం చోటుచేసుకుంది. 

IND Vs ENG 2nd Test : విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీస్కోర్ సాధించింది. ఆ మ్యాచ్ లో యువ బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్ తన అద్బుత ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈక్రమంలో శతకాన్ని నమోదు చేశారు. ఇలా మొత్తానికి టీమిండియా భారీ స్కోర్ చేసింది.  

ఇదిలా ఉంటే.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. APSRTC బస్సులో టీమిండియా క్రికెటర్లతో పాటుగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను APSRTC సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  

సాధారణంగా క్రికెట్ గ్రౌండ్ నుంచి ఆటగాళ్లు ఉండే హోటల్ కు  వెళ్లడానికి అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తారు. కానీ తాజాగా ఇంగ్లాండ్-ఇండియా మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు APSRTC బస్సులో ప్రయాణం చేశారు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా తొలిరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు హోటల్ వెళ్లడానికి లగ్జరీ బస్సులు కాకుండా.. ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

ఈ బస్సుల్లోనే ఇరుజట్ల క్రికెటర్లు ప్రయాణించారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను APSRTC తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అలాగే ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ కు APSRTC ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌(179 నాటౌట్) స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. రోహిత్ శర్మ(14), గిల్‌ (34), శ్రేయాస్ అయ్యర్(27) వంటి సీనియర్ ఆటగాళ్లు తడబడ్డ ఇంగ్లాండ్ బౌలర్లను జైస్వాల్‌ ధీటుగా ఎదుర్కొన్నాడు. తొలిరోజు ఆటముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది.  

APSRTC Buses being used by Team India and Team England cricket teams for the second test at Visakhapatnam

Thank you for patronising us pic.twitter.com/AOPUvNtQ0v

— APSRTC (@apsrtc)
click me!