IND vs ENG : ఆరంభం అదిరింది.. ఇంగ్లాండ్ ను దెబ్బ‌తీసి.. ఎవ‌రీ ఆకాశ్ దీప్.. ?

By Mahesh Rajamoni  |  First Published Feb 23, 2024, 12:08 PM IST

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ 4వ మ్యాచ్ లో టీమిండియా త‌ర‌ఫున అకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొడుతూ ఇంగ్లాండ్ ను దెబ్బ‌తీశాడు. 
 


India vs England - Akash Deep : రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్ -ఇంగ్లాండ్ 4 టెస్టులో భార‌త ప్లేయ‌ర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే అద్భుత‌మైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అరంగేట్రం ప్లేయ‌ర్ ఆకాశ్ దీప్ సూప‌ర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బ‌తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 112 ప‌రుగులు చేసింది. ఆకాశ్ దీప్ ఏడు ఓవ‌ర్ల బౌలింగ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్ లను పెవిలియన్ కు పంపాడు.

ఎవరీ ఆకాశ్ దీప్..? 

Latest Videos

undefined

27 ఏళ్ల ఆకాష్ ఆకాష్ దీప్ స్వ‌రాష్ట్రం బీహార్‌. మధ్యతరగతి కుటంబానికి చెందిన ఆకాశ్ దీప్ అనేక క‌ష్టాలు ఎదుర్కొని గల్లీ క్రికెట‌ర్ నుంచి జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చి అరంగేట్రం మ్యాచ్ తో అద‌ర‌గొట్టాడు. క్రికెట్‌ వైపు అడుగులు వేస్తున్న సమయంలో తండ్రి మరణం, కొద్దిరోజుల‌కే సోదురుడిని కోల్పోవ‌డంతో చాలా క‌ష్టాలు ఎదుర్కొన్నాడు. బిహార్‌లో అనుకూల ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో ప‌శ్చిమ బెంగాల్ కు మారాడు.

దేశ‌వాళీ క్రికెట్ లో అద‌ర‌గొట్టి.. ! 

ఆకాశ్ దీప్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో రాణించి ఆల్ రౌండర్ గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 30 మ్యాచ్ లను ఆడిన ఆకాశ్ దీప్.. 49 ఇన్నింగ్స్ లలో 104 వికెట్లు తీసుకున్నాడు. 7 సార్లు 4 వికెట్లు తీసుకున్నాడు. 4 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. లిస్టు ఏ క్రికెట్ లో 28 మ్యాచ్ లలో 42 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్ లో 41 మ్యాచ్ లలో 48 వికెట్లు తీశాడు. ఒకసారి 4 వికెట్ల తో తన అత్యుత్తమ బౌలింగ్ ను నమోదుచేశాడు.

బ్యాటింగ్ విషయానికి వస్తే.. 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 423 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 53 పరుగులు నాటౌగ్ గా నిలిచాడు. మొత్తంగా 28 ఫోర్లు, 32 సిక్సర్లు బాదాడు. లిస్టు ఏ క్రికెట్ లో 28 మ్యాచ్ లలో 140 పరుగులు చేయగా, అత్యధిక స్కోర్ 44 పరుగులు.ఐపీఎల్‌లో ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

 

WWW 🤝 Akash Deep!

Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 | | pic.twitter.com/YANSwuNsG0

— BCCI (@BCCI)

IND VS ENG : రాంచీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా నుంచి కొత్త ప్లేయర్ ఎంట్రీ 

click me!