IND vs ENG: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ స్టార్ ఆటగాళ్లు ఎవరు? వాళ్లు దూరం కావడానికి కారణమేంటీ?
IND vs ENG: టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు రెండో మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం కానున్నారు. ఈ సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.
చివరి మూడు టెస్టులకు ఎవరిని జట్టులోకి తీసుకోవాలనేది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి తీవ్ర ఉత్కంఠగా మారింది. జడేజా, కోహ్లి లేకపోవడంతో టీమ్ ఇండియాకు ఖచ్చితంగా తీరని లోటే. తొలి మ్యాచ్‌లో ఓడి సిరీస్‌లో 0-1తో వెనుకబడిన భారత్ ఇప్పుడు కోహ్లి, జడేజాలు ఔట్ అవుతున్నారనే వార్తలు టీమిండియా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
విరాట్ కోహ్లీ
టెస్ట్ సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీని భారత జట్టులో చేర్చారు, అయితే మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందే, కోహ్లీ రెండు మ్యాచ్‌ల నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. కోహ్లీ తన వ్యక్తిగత కారణాల వల్ల టెస్టు సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల నుండి కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నట్లు BCCI తెలిపింది. అయితే, అతను సిరీస్‌లోని మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉంటాడా లేదా అనేది స్పష్టం చేయలేదు.
రవీంద్ర జడేజా
హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో జడేజా బాల్, బ్యాటింగ్‌తో అద్భుతంగా ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. కానీ జడేజా మ్యాచ్‌లో కొంచెం అసౌకర్యంగా కనిపించాడు. తరువాత BCCI మొదటి టెస్ట్ సమయంలో జడేజా గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా మీడియా నివేదికల నుండి అందిన సమాచారం ప్రకారం.. జడేజా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పట్టవచ్చవనీ, ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టుతో పాటు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనున్న మూడో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
మహమ్మద్ షమీ
మరోవైపు.. కుడి తొడలో నొప్పితో కేఎల్ రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరారు. అయితే.. మూడో టెస్ట్‌లోపు కేఎల్ రాహుల్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తారని సమాచారం. అలాగే.. చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు కూడా అందుబాటులో ఉండట్లేదు. ప్రస్తుతం మహమ్మద్ షమీ లండన్‌లో ఉన్నాడు. స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నాడు. గాయం నయమయ్యేందుకు అతను ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాడని, ఈ పరిస్థితుల్లో అతను టెస్ట్ మ్యాచ్ ఆడలేడని, ఐపీఎల్ 2024లోనే రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.