
Young Indian opening batter Yashasvi Jaiswa: ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగులతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ సిరీస్ లో బ్యాట్స్ మన్ లతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఐదు టెస్టుల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు తీశాడు. అయితే, అద్భుతమైన ప్రదర్శన ఉన్నప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లో మరో యంగ్ ప్లేయర్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ లో పరుగుల వరద పారించిన 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
ఆశ్చర్యకరంగా ఐదు టెస్టుల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా జైస్వాల్ గెలుచుకోలేకపోయాడు కానీ, చివరిలో అతని అద్భుతమైన ప్రదర్శనకు రివార్డ్ పొందాడు. 22 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఇంగ్లాండ్ తో జరిగిన ఈ సిరీస్ లో మొత్తం ఐదు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, మూడు అర్ధసెంచరీల సహాయంతో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 89 సగటుతో 712 పరుగులు చేశాడు.
ఐపీఎల్ ను అందరూ ఇష్టపడేది అందుకే.. విరాట్ కోహ్లీకి ఎంత ఇష్టమో చూడండి.. !
శనివారం ధర్మశాలలో ఐదో టెస్టు ముగిసిన తర్వాత మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. ''నేను సిరీస్‌ను నిజంగా ఆస్వాదించాను. నేను ఆడిన తీరుతో సంతోషంగా ఉన్నాను. జట్టు విజయానికి నావంతు ఏం చేయాలనేదానిని ఆలోచిస్తానని'' చెప్పాడు. కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ జైస్వాల్‌కి భారత్ లో మొదటి టెస్ట్ సిరీస్. సునీల్ గవాస్కర్ తర్వాత ఒక సిరీస్‌లో 700 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ భారత ప్లేయర్ గా కూడా జైస్వాల్ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ 655 పరుగుల రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
IND VS ENG: కోహ్లీ, ధోని, గంగూలీ, అజారుద్దీన్ తర్వాత కెప్టెన్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు !