India vs England : భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో టీమిండియా బాల్, బ్యాట్ తో అద్భుతమైన ఆటను కొనసాగించింది. బౌలర్లు, బ్యాట్స్ మన్లు రాణించడంతో 4-1 తో ఈ సిరీస్ ను కైవసం చేసుకుంది. 100 టెస్టు ఆడుతున్న అశ్విన్ ధర్మశాలలో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు.
India vs England : భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.
మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల కోల్పోయి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 156 పరుగులు వెనుకబడి ఉంది. తన 100వ టెస్టు ఆడుతున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ తో 4 టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా మన బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ పతనం ఆగలేకపోయింది. 195-10 పరుగులకే కుప్పకూలింది.
undefined
రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా 2, రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జోరూట్ 84 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ 218/10, సెకండ్ ఇన్నింగ్స్ 195/10 (జోరూట్ 84, జానీ బెయిర్‌స్టో 39, జో రూట్ 34 నాటౌట్; రవిచంద్రన్ అశ్విన్ 5/77)
భారత్: 477/10 (శుభ్ మన్ గిల్ 110, రోహిత్ శర్మ 103, దేవదత్ పడిక్కల్ 65, సర్ఫరాజ్ ఖాన్ 56, యశస్వి జైస్వాల్ 57 ; షోయబ్ బషీర్ 5/173)
In the air and taken by Jasprit Bumrah! 💪
Kuldeep Yadav with the final wicket 😃
End of the match and series in Dharamsala ⛰️
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o | | pic.twitter.com/wlOYofabuC
IND VS ENG: రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ రికార్డులు సమం.. రోహిత్ శర్మ రికార్డుల మోత !