IND vs ENG: కోహ్లీ, ధోని, గంగూలీ, అజారుద్దీన్ త‌ర్వాత కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు !

By Mahesh RajamoniFirst Published Mar 9, 2024, 4:12 PM IST
Highlights

India vs England : ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. దీంతో టెస్టు క్రికెట్ లో భార‌త్ కు 10 విజ‌యాలు అందించిన కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు.
 

Rohit Sharma - Most wins as India captain in Tests: భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల టెస్టు సిరీస్ లోని చివ‌రిదైన 5వ టెస్టు మ్యాచ్ ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగింది. భార‌త్ అన్ని అంశాల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ ను భార‌త్ 4-1తో కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ దిగ్గజ ప్లేయ‌ర్లు ఎంఏకే పటౌడీ, సునీల్ గవాస్కర్‌లను అధిగమించి భారత ఐదవ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఘ‌న‌త సాధించాడు.

కెప్టెన్‌గా భారత్‌కు తన 16వ టెస్టులో, రోహిత్ 10వ విజయాన్ని సాధించాడు. దీంతో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి టీమిండియా కోసం 10 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించిన తర్వాత రోహిత్ శ‌ర్మ‌ ఈ ఫీట్ సాధించాడు.

James Anderson: చ‌రిత్ర సృష్టించిన జేమ్స్ అండ‌ర్స‌న్.. తొలి పేసర్​గా రికార్డు !

టెస్టు క్రికెట్ లో భార‌త్ కు అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్లు

  1. విరాట్ కోహ్లీ - 40
  2. ఎంఎస్ ధోని - 27
  3. సౌరవ్ గంగూలీ - 21
  4. మహ్మద్ అజారుద్దీన్ - 14
  5. రోహిత్ శర్మ - 10

ఇక ఆడిన మ్యాచ్ లు, గెలుపు శాతం పరంగా చూస్తే రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. 16 మ్యాచ్ లకు కెప్టెన్ గా ఉండగా, 10 మ్యాచ్ లను గెలిపించాడు. విజయాల శాతం 62.50గా ఉంది. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ మొత్తం 68 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించగా, 40 విజయాలతో 58.82 విన్నింగ్ శాతం నమోదుచేశాడు. ధర్మశాల టెస్టు విజయంతో ధోనిని అధిగమించి ఇంగ్లాండ్ పై టెస్టుల్లో భారత్ కు రెండో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు ఆసీస్ తో ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగింటిలో విజయం సాధించాడు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ మాత్రమే ఇంగ్లాండ్ పై భారత్ తరఫున ఎక్కువ రెడ్ బాల్ మ్యాచ్ లు గెలిచాడు.

IND VS ENG: భార‌త్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘ‌న విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం

click me!