INDvsAUS: మళ్లీ ఆ ఇద్దరే... నిలబడ్డ లబుషేన్, స్టీవ్ స్మిత్.. లంచ్ సమయానికి...

Published : Jan 15, 2021, 07:41 AM IST
INDvsAUS: మళ్లీ ఆ ఇద్దరే... నిలబడ్డ లబుషేన్, స్టీవ్ స్మిత్.. లంచ్ సమయానికి...

సారాంశం

30 పరుగులు చేసిన స్మిత్, 19 పరుగులు చేసిన లబుషేన్... మూడో వికెట్‌కి 48 పరుగుల అజేయ భాగస్వామ్యం... లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసిన ఆసీస్...

మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్... మరోసారి సత్తాచాటుతున్నారు. అనుభవం లేని భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, మొదటి రోజు లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్ 1 పరుగు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... 5 పరుగులు చేసిన హార్రీస్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 17 పరుగులకే ఓపెనర్లద్దరినీ కోల్పోయిన ఆసీస్‌ను లబుషేన్, స్మిత్ కలిసి మరోసారి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి అజేయంగా 48 పరుగులు జోడించారు. 

 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు