మొదటి ఓవర్‌లో సిరాజ్, మొదటి బంతికే శార్దూల్... రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్...

By team teluguFirst Published Jan 15, 2021, 6:27 AM IST
Highlights

మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసిన సిరాజ్...

మొదటి బంతికే వికెట్ తీసిన శార్దూల్ ఠాకూర్...

2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా...

ఏ మాత్రం అనుభవం లేని భారత బౌలర్లు, ఆస్ట్రేలియా ఓపెనర్లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు. మూడో మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్... ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. నాలుగు బంతుల్లో ఒకే పరుగు చేసిన డేవిడ్ వార్నర్, సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత 9వ ఓవర్‌లో బౌలింగ్‌కి దిగిన శార్దూల్ ఠాకూర్, తాను వేసిన మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. 23 బంతుల్లో 5 పరుగులు చేసిన మార్కస్ హార్రీస్... ఠాకూర్ బౌలింగ్‌లో వాష్టింగన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయి 22 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

2018లో వెస్టిండీస్‌లో టెస్టు మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసి కేవలం 10 బంతులేసి, గాయంతో తప్పుకున్న శార్దూల్ ఠాకూర్, రీఎంట్రీలో మొదటి బంతికే వికెట్ తీయడం విశేషం. క్రీజులో స్టీవ్ స్మిత్, లబుషేన్ ఉన్నారు. గత మ్యాచ్‌లో భారత జట్టును బాగా ఇబ్బంది పెట్టిన ఈ ఇద్దరినీ ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే, భారత జట్టుకి అంత మంచిది. 

click me!