ఆస్ట్రేలియా కంటే 1000 వికెట్లు తక్కువ... నాలుగో టెస్టులో టీమిండియా పరిస్థితి ఇది...

Published : Jan 15, 2021, 06:58 AM IST
ఆస్ట్రేలియా కంటే 1000 వికెట్లు తక్కువ... నాలుగో టెస్టులో టీమిండియా పరిస్థితి ఇది...

సారాంశం

ఏ మాత్రం అనుభవం లేని బౌలింగ్ యూనిట్‌తో నాలుగో టెస్టు ఆడుతున్న భారత జట్టు... బౌలింగ్ యూనిట్‌ను లీడ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్... భారత జట్టులో ఆరుగురు యంగ్ ప్లేయర్లు... 

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టును గాయాలు తీవ్రంగా బాధించాయి. గాయాల కారణంగా మొదటి టెస్టులో షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ జట్టుకి దూరమయ్యారు. సిడ్నీ గ్రౌండ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అయితే ఏకంగా ఐదుగురు ప్లేయర్లు గాయపడ్డారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకోగా హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా జట్టుకి దూరమయ్యారు.

కీలక బౌలర్లు దూరం కావడంతో ఏ మాత్రం అనుభవం లేని బౌలింగ్ యూనిట్‌తో నాలుగో టెస్టు ఆడుతోంది భారత జట్టు. రెండు, మూడో టెస్టు ఆడిన సిరాజ్, బౌలింగ్ యూనిట్‌ను లీడ్ చేస్తున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సిరాజ్, సైనీ, నటరాజన్, శార్దూల్ ఠాకూర్‌, వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన భారత జట్టు మొత్తం అనుభవం 13 వికెట్లు కాగా... కమ్మిన్స్, హజల్‌వుడ్, నాథన్ లియాన్, స్టార్క్‌లతో కూడిన ఆస్ట్రేలియా అనుభవం 1013 వికెట్లు.

భారత జట్టులోని గిల్, సిరాజ్, సైనీ, నటరాజన్, సుందర్ ఈ టెస్టు సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వగా, మూడేళ్ల క్రితం 10 బంతులేసి గాయపడిన శార్దూల్ ఠాకూర్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. వీరందరి అనుభవం మొత్తం కలిపి 8 టెస్టులే. 
 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు