IND vs AFG: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ్యాచ్ ఎప్పుడు? ఎక్క‌డ లైవ్ చూడాలి? పూర్తి వివ‌రాలు ఇవిగో

By Mahesh Rajamoni  |  First Published Jan 16, 2024, 3:06 PM IST

IND vs AFG 3rd T20I: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొద‌టి రెండు మ్యాచ్ ల‌లో టీమిండియా విజ‌యం సాధించింది. ఇక ఈ సిరీస్ లో చివ‌రి, మూడో మ్యాచ్ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నుండ‌గా, ఇక్క‌డ కూడా విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ చూస్తోంది. 
 


India vs Afghanistan 3rd T20: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా  చేసుకున్న త‌ర్వాత టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ఆడుతోంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ముందు భార‌త్ కు ఈ సిరీస్ చివ‌రిది కావ‌డంతో గెలుపే ల‌క్ష్యంగా భార‌త్ ముందుకు సాగుతోంది. టీ20 ప్రపంచకప్ కు మరో ఐదు నెలల సమయం ఉండటంతో భారత్ తన చివరి మూడు టీ20లను అఫ్గానిస్థాన్ తో ఆడుతోంది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ కు ఇది మూడో టీ20 ద్వైపాక్షిక సిరీస్ కాగా, దాదాపు 14 నెల‌ల త‌ర్వాత అంటే 2022 నవంబర్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20లు ఆడుతున్నారు. భారత స్టార్ బ్యాటింగ్ పునరాగమనం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారత్ ప్రదర్శన అంత‌గా గొప్ప‌గా లేదు కానీ, యంగ్ ప్లేయ‌ర్లు రాణించ‌డంతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ కు దూర‌మ‌య్యారు. చాలా కాలం త‌ర్వాత టీ20 మ్యాచ్ ఆడిన రోహిత్ శ‌ర్మ ప‌రుగులు చేయ‌కుండానే డ‌కౌట్ గా వెనుతిరిగాడు. ఇక రెండో టీ20ల్లో కూడా భార‌త్ యువ ఆట‌గాళ్లు రాణించ‌డంతో ఆఫ్ఘ‌నిస్తాన్ ను చిత్తు చేసింది. రెండో టీ20లో శివమ్ దూబే సుడిగాలి ఇన్నింగ్స్ తో పాటు యశస్వి జైస్వాల్ అఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. రెండు మ్యాచ్ ల‌ను గెలిచిన భార‌త్ ఇప్ప‌టికే 2-0 అధిక్యంతో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది.

Latest Videos

జ‌ట్టులో చోటు దక్కకపోవ‌డంపై మౌనం వీడిన శిఖర్ ధావన్.. గ‌బ్బ‌ర్ కామెంట్స్ వైర‌ల్ !

భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మూడో టీ20 మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌ని చూస్తోంది టీమిండియా. భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 వేదిక‌, లైవ్ స్ట్రీమింగ్ స‌హా పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి..

భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 మ్యాచ్  ఎప్పుడు జ‌రుగుతుంది?

జనవరి 17న (బుధ‌వారం) భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది.

భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది?

భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని భారత్ లో ఏ టెలివిజన్ లో చూడ‌వ‌చ్చు? 

భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 మ్యాచ్ ను స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 మ్యాచ్ ను ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు?

భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జియో సినిమా యాప్, వెబ్ సైట్ లో కూడా లైవ్ చూడ‌వ‌చ్చు.

ప్రపంచంలోనే తొలి క్రికెట‌ర్ గా విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

click me!