India Afghanistan T20 Series: భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ భారత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ పై ఇరు టీమ్ ల కెప్టెన్లు రోహిత్ శర్మ, ఇబ్రహీం జద్రాన్ లు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
IND vs AFG 1st T20I: మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం గ్రౌండ్ లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు మ్యాచ్ ను ప్రభావితం చేయనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ కీలకంగా ఉంటుందని మొదటి నుంచి విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొదట బౌలర్స్ కు అనుకూలంగా ఉండనుండగా, మ్యాచ్ సాగుతున్న కొద్ది బ్యాటర్స్ కు అనుకూలంగా పిచ్ మారనుంది.
ఇలాంటి మొహాలీ పిచ్ నేపథ్యంలో టాస్ పై ఇరు టీమ్ ల కెప్టెన్లు రోహిత్ శర్మ, ఇబ్రహీం జద్రాన్ లు టాస్ తర్వాత ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. "మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాము, కానీ అది పెద్ద సమస్య కాదు.. మేము మెరుగైన బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాము. మా ప్రణాళికలను అమలు చేస్తాము. టీ20 ప్రపంచకప్‌కు ముందు అనుభవాన్ని పొందడానికి ఇది గొప్ప అవకాశం. మేము కొంత సానుకూల క్రికెట్‌ని ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.
undefined
IND v AFG: సెంచరీ కొట్టడం ఖాయం.. సరికొత్త రికార్డు సృష్టించనున్న రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. దీనికి ప్రత్యేక కారణం లేదు.. పిచ్ బాగుంది.. ఇక్కడ పెద్దగా మారదు. మూడు గేమ్స్ లోనూ రాణించాలి. ప్రపంచ కప్‌కు ముందు టీ20 క్రికెట్‌ను మేము ఎక్కువగా కలిగిలేము.. కానీ ఇది అంతర్జాతీయ గేమ్.. మేము కొన్ని అంశాలను సాధించడానికి ప్రయత్నిస్తాము. నేను రాహుల్ భాయ్‌తో కలయిక ముందుకు సాగడం.. మనం సమూహంగా ఏమి చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం..గెలుపు ముఖ్యం.. అని తెలిపాడు.
దక్షిణాఫ్రికాలో విజయవంతమైన పర్యటన తర్వాత.. ఆఫ్ఘనిస్తాన్‌తో 3-మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను భారత్ అడుతోంది. రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించినంతవరకు ఈ సిరీస్ భారత్ ఇదే చివరిది. కాబట్టి ఈ సిరీస్ లో సత్తా చాటాలని టీమిండియా చూస్తోంది. ఆఫ్ఘన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ లేకపోవడం కూడా భారత్ కు అనుకూలించే అంశమే. చిన్నటీమ్ అయినప్పటికీ.. టీ20ల్లో సంచలన విజయాలతో ఆఫ్ఘన్ ముందుకు సాగుతోంది. ఇక మొహాలిలో మంచుతో కూడిన రాత్రి, శీతాకాలం చలి, మంచు ఖచ్చితంగా కీరోల్ పోషించనుంది.
క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు.. గ్రౌండ్ లోనే గుండెపోటుతో ప్లేయర్ మృతి
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ ఉర్హక్.
IND v AFG: ప్రపంచ రికార్డుతో పాటు ధోనీ రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ..