డబ్ల్యూపీఎల్‌లో ‘తొలి’ ఘనతలు.. మొదటి పరుగు, వికెట్ ప్రత్యేకం..

Published : Mar 05, 2023, 02:07 PM IST
డబ్ల్యూపీఎల్‌లో ‘తొలి’ ఘనతలు..  మొదటి పరుగు, వికెట్ ప్రత్యేకం..

సారాంశం

WPL 2023: ప్రేమ, స్నేహం, వ్యాపారం, ఉద్యోగం.. రంగమేదైనా ‘తొలి అడుగు’ ఎప్పుడూ ప్రత్యేకమే.  వేయి మైళ్ల ప్రయాణం కూడా మొదలయ్యేది తొలి అడుగుతోనే.. నిన్నటి మ్యాచ్ లో ఆ ‘తొలి ఘనతలు’ ఇక్కడ చూద్దాం.. 

సుమారు రెండేండ్లుగా మహిళల ఐపీఎల్ మీద ఊరించి.. ఊరించి.. ఎట్టకేలకు బీసీసీఐ నిన్న (మార్చి 4) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  (డబ్ల్యూపీఎల్)  తొలి సీజన్ ను అట్టహాసంగా ప్రారంభించింది.  తొలి మ్యాచ్  ముంబై ఇండియన్స్ -  గుజరాత్ జెయింట్స్ మధ్య   డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముగియగా హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని    ముంబై జట్టు   బంపర్ విక్టరీతో బోణీ కొట్టింది.  

వేయి మైళ్ల ప్రయాణమైనా  తొలి అడుగుతోనే ప్రారంభమవుతుందంటారు. వ్యాపారమైనా, ఉద్యోగమైనా,  ప్రేమ అయినా, ఇంకా ఏదైనా  ‘తొలి’ ఎప్పుడూ ప్రత్యేకమే.  డబ్ల్యూపీఎల్ లో భాగంగా ముంబై-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా నమోదైన ఆ ‘తొలి ఘనతలు’ ఇక్కడ చూద్దాం. 

- డబ్ల్యూపీఎల్  తొలి సీజన్ లో టాస్ గెలిచిన జట్టు గుజరాత్ జెయింట్స్. ఈ మ్యాచ్ లో గుజరాత్.. మొదట బౌలింగ్ చేసింది. బ్యాటింగ్ చేసిన తొలి జట్టు ముంబై.  
- ఈ సీజన్ లో  తొలి బంతిని విసిరిన బౌలర్ గా ఆస్ట్రేలియా  ప్లేయర్ ఆష్ గార్డ్‌నర్ నిలిచింది.  
- తొలి బంతిని ఎదుర్కున్న బ్యాటర్  భారత్ కు చెందిన  యస్తికా భాటియా. ఈ లీగ్ లో తొలి పరుగు తీసిన బ్యాటర్ కూడా ఆమెనే. 
- డబ్ల్యూపీఎల్ లో  మొదటి సిక్స్, ఫోర్ కొట్టిన  బ్యాటర్ విండీస్ కు చెందిన హీలి మాథ్యూస్.   
- ఈ లీగ్ లో తొలి వికెట్ తీసిన  బౌలర్ తనూజా కన్వర్ (భారత్).. ఆమె బౌలింగ్ లోనే యస్తికా భాటియా.. వెర్హమ్ కు (ఈ సీజన్ లో ఇదే తొలి  క్యాచ్) క్యాచ్ ఇచ్చింది. 
- ఫస్ట్ క్లీన్ బౌల్డ్ :  మాథ్యూస్ (గార్డ్‌నర్ బౌలింగ్ లో) 
- తొలి హాఫ్ సెంచరీ : హర్మన్‌‌ప్రీత్ కౌర్ : 65. తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆమే.. 

 

- తొలి మ్యాచ్ లోనే  200 ప్లస్ స్కోరు చేసిన జట్టు : ముంబై 
- ఆడిన మొదటి మ్యాచ్ లోనే ముంబై బౌలర్ సైకా ఇషాక్.. నాలుగు వికెట్లతో చెలరేగింది. 
- ఐపీఎల్ తొలి సీజన్  తొలి మ్యాచ్ లో  కోల్కతా నైట్ రైడర్స్.. ఆర్సీబీపై  220 ప్లస్ స్కోరు చేసింది.  తాజాగా ముంబై కూడా తాము ఆడిన మొదటి సీజన్ మొదటి మ్యాచ్ లోనే  207 పరుగులు చేయడం విశేషం. 

 

 

కాగా నిన్నటి మ్యాచ్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హీలి మాథ్యూస్ (47),  హర్మన్‌ప్రీత్ (65), అమిలియా (45) రాణించారు.  అనంతరం  లక్ష్య ఛేదనలో గుజరాత్.. 15.1 ఓవర్లలో  64 పరుగులకే కుప్పకూలింది.  ఆ జట్టులో హేమలత (29) టాప్ స్కోరర్. 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యా రు. ఫలితంగా  గుజరాత్.. తొలి మ్యాచ్ లోనే 143 పరుగుల భారీ తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకుంది. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు