ప్చ్...తెలివైనోడు, అతడిని మిస్సయ్యాం: సెహ్వాగ్‌ కంటే బాగా ఆడేవాడన్న అక్తర్

By Siva KodatiFirst Published Apr 29, 2020, 3:59 PM IST
Highlights

భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కన్నా ఇమ్రాన్ నజీర్ తెలివైనవాడని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కానీ సెహ్వాగ్‌లా అతను బుర్ర ఎక్కువగా ఉపయోగించలేదని షోయబ్ పేర్కొన్నాడు

భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కన్నా ఇమ్రాన్ నజీర్ తెలివైనవాడని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కానీ సెహ్వాగ్‌లా అతను బుర్ర ఎక్కువగా ఉపయోగించలేదని షోయబ్ పేర్కొన్నాడు.

అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం అతనిని పట్టించుకోలేదని విమర్శించాడు. దేశంలోని ప్రతిభావంతులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జాగ్రత్తగా చూసుకోలేదని అక్తర్ అన్నాడు. ఇమ్రాన్ నజీర్ కన్నా సెహ్వాగ్ ఎక్కువగా తెలివైనవాడేం కాదని తన నమ్మకం.

Also Read:ఆండ్రీ రసెల్ బర్త్ డే స్పెషల్.. కేకేఆర్ స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో

ప్రతిభపరంగా ఇద్దరికీ పోలిక లేదని, తాము అతనిని కాపాడుకోలేకపోయామని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌పై నజీర్ విధ్వంసక శతకం బాదినప్పుడు అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని తాను కోరినట్లు షోయబ్ గుర్తుచేశాడు. కానీ బోర్డు తన మాటను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పాకిస్తాన్ తరపున నజీర్ 8 టెస్టులు ఆడి 427 పరుగులు చేశాడు. 79 వన్డేల్లో 1,895 పరుగులు సాధించాడు. ఇక సెహ్వాగ్ విషయానికి వస్తే భారత్ తరపున 104 టెస్టుల్లో 8,596 పరుగులు.. 251 వన్డేల్లో 8,273 పరుగులు చేశాడు.

Also Read:గృహహింస వద్దు: భార్యకు శిఖర్ ధావన్ బాక్సింగ్ శిక్షణ వీడియో వైరల్

ప్రతిభావంతులను పీసీబీ రక్షించుకోలేకపోవడం దురదృష్టకరమని లేకుండా సెహ్వాగ్ కంటే మెరుగైన ఆటగాడిని తాము నజీర్‌లో చూసేవాళ్లమని అక్తర్ అభిప్రాయపడ్డాడు. నజీర్ మైదానం నలువైపులా షాట్లు ఆడతాడని, అలాగే మంచి ఫీల్డర్‌ అని చెప్పాడు.

తాము తెలివిగా నజీర్‌ను ఉపయోగించుకోవాల్సిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇమ్రాన్ నజీర్ ఎప్పుడైనా బాగా ఆడాడంటే అది జావెద్ మియాందాద్ వల్లేనని అక్తర్ తెలిపాడు. ఆయన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి నజీర్ బాగా ఆడేలా చూసేవాడని, ఎప్పుడైనా చెత్త షాట్ ఆడినా ఏకాగ్రతతో ఆడేలా సందేశం పంపించేవాడని అక్తర్ చెప్పాడు. 

click me!