
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనర్జీనే వేరబ్బా. ఎక్కడున్నా... పక్కవాళ్లని ఏదో ఒక విధంగా వినోదపరుస్తూ ఉంటాడు. మైదానంలోనూ సరదాగా ఉంటాడు. బ్యాట్ చేతపట్టి పరుగులు చేయడమే కాదు... అప్పుడప్పుడు డ్యాన్స్ లు కూడా అదరగొడుతూ ఉంటాడు. ఆ వీడియోలు నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి.
2022 ఆసియా కప్ నుండి ఫామ్‌లో కి వచ్చిన కోహ్లీ.. అప్పటి నుంచి అదరగొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో కూడా, ఇప్పటివరకు మూడు గేమ్‌లలో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక కోహ్లీ ఆటకు మాత్రమే కాదు.. డ్యాన్స్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో కూడా షారుఖ్‌తో కలిసి పఠాన్ సాంగ్ చేశాడు.
కాగా... కోహ్లీ డ్యాన్స్ చూసి ఓ సినీ క్రిటిక్ కోహ్లీకి మూవీ ఆఫర్ చేయడం విశేషం.కమల్ ఆర్ ఖాన్... ఓ మూవీలో.. కోహ్లీ డ్యాన్స్ చేయాల్సిందిగా ఆఫర్ చేయడం విశేషం.
2020 IPL సమయంలో కోహ్లీ చేసిన డ్యాన్స్ వీడియోని ఇప్పుడు రీట్వీట్ చేస్తూ.. ఈ బంపర్ ఆఫర్ ఇవ్వడం విశేషం. తన కోహ్లీ డ్యాన్స్ స్కిల్స్ ఎంతగానో నచ్చాయని, అందుకే తన తదుపరి చిత్రం #Deshdrohi2లో అతనికి ఐటెమ్ నంబర్‌ను ఆఫర్ చేద్దామనుకుంటున్నాను. అంటూ ట్వీట్ చేశాడు. కాగా... కమల్ ఆర్ ఖాన్... దేశద్రోహి (2008) , ఏక్ విలన్ (2014) వంటి చిత్రాలలో నటించారు. పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నాడు.
విరాట్ కోహ్లి ఇటీవల లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన 46వ హాఫ్ సెంచరీని సాధించాడు. RCB మాజీ కెప్టెన్ 35 బంతుల్లో 50 పరుగుల మార్కును చేరుకున్నాడు, ఈ సీజన్‌లో అతను రెండవ అర్ధ సెంచరీని నమోదు చేశాడు.