IPL 2023: కేకేఆర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం... రాణా, రింకూ పోరాడినా..

Published : Apr 14, 2023, 11:15 PM IST
IPL 2023: కేకేఆర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం... రాణా, రింకూ పోరాడినా..

సారాంశం

IPL 2023:  కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో పోరాడిన నితీశ్ రాణా.. రింకూ సింగ్ మెరుపులు... మిస్ ఫీల్డింగ్స్, డ్రాప్ క్యాచ్‌లతో కేకేఆర్‌కి వరుస ఛాన్సులు ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఐపీఎల్ 2023 సీజన్‌‌లో మరో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ సాగి, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగించింది. ఆఖరి ఓవర్‌ వరకూ సాగిన మ్యాచ్‌లో పెద్దగా హై డ్రామా లేకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఆర్‌సీబీపై 212 పరుగుల భారీ టార్గెట్‌ని ఊదేసిన కేకేఆర్, సన్‌రైజర్స్ విధించిన 229 పరుగుల లక్ష్యఛేదనలో 205 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో ఓడింది.

229 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆరంభంలోనే కేకేఆర్‌కి షాక్ తగిలింది. రహ్మనుల్లా గుర్భాజ్, భువీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాతి బంతికే సునీల్ నరైన్‌ని మార్కో జాన్సెస్ అవుట్ చేయడంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. ఇక వార్ వన్‌సైడ్ అవుతుందని అనుకుంటుండగా నితీశ్ రాణా, ఎన్ జగదీశన్ కలిసి హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించారు..

ఉమ్రాన్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో 4, 6, 4, 4, 4, 6 బాది 28 పరుగులు రాబట్టాడు నితీశ్ రాణా. మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించిన నారాయణ్ జగదీశన్, 21 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసి మయాంక్ మర్కండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

6 బంతుల్లో 3 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్ కూడా మయాంక్ మర్కండే బౌలింగ్‌లోనే మార్కో జాన్సెన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీల మోత మోగించిన కెప్టెన్ నితీశ్ రాణా, 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు..

భువీ బౌలింగ్‌లో రింకూ సింగ్ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న కేకేఆర్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది. కేకేఆర్ విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 87 పరుగులు కావాల్సి వచ్చాయి. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో నితీశ్ రాణా, రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌లను వాషింగ్టన్ సుందర్ అందుకోలేకపోయాడు.. 

16వ ఓవర్‌లో 17 పరుగులు రావడంతో చివరి 4 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 70 పరుగులు అవసరమయ్యాయి. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసిన కెప్టెన్ నితీశ్ రాణా, టి నటరాజన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాణా అవుటయ్యే సమయానికి కేకేఆర్‌కి 21 బంతుల్లో 64 పరుగులు కావాలి...

భువీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 10 పరుగులే వచ్చాయి. దీంతో కేకేఆర్ విజయానికి చివరి 2 ఓవర్లలో 48 పరుగులు కావాల్సి వచ్చాయి. సన్‌రైజర్స్ క్యాచులు డ్రాప్ చేయడంతో 3 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రింకూ సింగ్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో 32 పరుగులు కావాల్సి ఉండగా మొదటి బంతికి శార్దూల్ ఠాకూర్ అవుట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఓటమి ఖరారైపోయింది...

చివరి ఓవర్‌కి ముందే ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్, ఆఖరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో ఒకే పరుగు ఇచ్చి మ్యాచ్‌ని వన్‌సైడ్ చేసేశాడు. ఐదో బంతికి సిక్సర్ బాదిన రింకూ సింగ్, కేకేఆర్ స్కోరుని 200 దాటించాడు. 

అంతకుముందు హారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో పాటు కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, అభిషేక్ శర్మ మెరుపులతో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.. 13 బంతుల్లో 9 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అదే ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన రాహుల్ త్రిపాఠి, 9 పరుగులు చేసి ఆఖరి బంతికి వికెట్ కీపర్‌ గుర్భాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన ఆండ్రే రస్సెల్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ స్కోరు వేగాన్ని దెబ్బ తీశాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, హారీ బ్రూక్‌తో కలిసి మూడో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు..


17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసిన ఆండ్రే రస్సెల్, తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్‌ని శార్దూల్ ఠాకూర్ ముగించాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్‌లో మొట్టమొదటి సెంచరీ అందుకున్నాడు హారీ బ్రూక్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇదే మొదటి సెంచరీ. 6 బంతులు ఫేస్ చేసిన హెన్రీచ్ క్లాసిన్ 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో