ఫ్యామిలీ మొత్తం వెళ్లిపోయింది.. ఆమె మాత్రమే ఉంది: సెంచరీ వీరుడు హ్యారీ బ్రూక్

Published : Apr 15, 2023, 09:34 AM IST
   ఫ్యామిలీ మొత్తం వెళ్లిపోయింది.. ఆమె మాత్రమే ఉంది: సెంచరీ వీరుడు హ్యారీ బ్రూక్

సారాంశం

ఈ సీజన్  తొలి సెంచరీ చేసింది కూడా హ్యారీనే కావడం విశేషం. అతని ఆటను చూసి.. హ్యారీ గర్ల్ ఫ్రెండ్  ఆనందం వ్యక్తం చేసింది. స్టేడియంలో నుంచి చూస్తూ... చప్పట్లు కొడుతూ... ఉత్సాహ పరిచింది.  

ఐపీఎల్ 2023లో అత్యంత ధర పలికిన ఆటగాడు హ్యారీ బ్రూక్. ఈ ఇంగ్లాండ్ ఆటగాడిని సన్ రైజర్స్ జట్టు రూ.13.25కోట్లకు కొనుగోలు చేసింది. అయితే... తనను కొనుగోలు చేసిన ధరకు హ్యారీ తాజాగా న్యాయం చేశాడు. మొదట సరిగా ఆడకుండా నిరాశ పరిచిన హ్యారీ... శుక్రవారం జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు. సెంచరీతో దుమ్ముదులిపేశాడు. తనను విమర్శించిన వారికి సెంచరీతో సమాధానం చెప్పాడు. ఈ సీజన్  తొలి సెంచరీ చేసింది కూడా హ్యారీనే కావడం విశేషం. అతని ఆటను చూసి.. హ్యారీ గర్ల్ ఫ్రెండ్  ఆనందం వ్యక్తం చేసింది. స్టేడియంలో నుంచి చూస్తూ... చప్పట్లు కొడుతూ... ఉత్సాహ పరిచింది.

 

కాగా... మ్యాచ్ అనంతరం హ్యారీ మీడియాతో మాట్లాడాడు. మొదట తనకు స్పిన్ ఆఢటం కష్టంగా అనిపించిందని చెప్పాడు. కానీ... పవర్ ప్లేను సద్వినియోగం చేసకోవాలని అనుకున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్ లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. మార్క్రమ్, అభిషేక్ శర్మలకు సహకరించానని చెప్పాడు. వాళ్లు ఔట్ అయిపోయిన తర్వాత.. ఆ బాధ్యతను తాను తీసుకున్నట్లు చెప్పాడు. బాగా ఆడాలని తాను అనుకున్నానని... కానీ.. సెంచరీ చేస్తానని ఊహించలేదన్నాడు.

తాను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి తన ఫ్యామిలీ మొత్తం భారత్ కి వచ్చిందని చెప్పిన ఆయన.. కొన్ని కారణాల వల్ల.. వారంతా తిరిగి వెళ్లిపోయారని చెప్పాడు. కేవలం తన గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఇక్కడ ఉందని... ఆమె తన ఆటను బాగా ఎంజాయ్ చేసిందని.. ఈ రోజు తన ఆటను తన ఫ్యామిలీ మొత్తం ఆనందిస్తోందని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !