విరిగిన కేన్ విలియంసన్ బొటన వేలు... ఐపీఎల్‌లో గాయపడి, వన్డే వరల్డ్ కప్ రీఎంట్రీ మ్యాచ్‌లోనే!

By Chinthakindhi Ramu  |  First Published Oct 14, 2023, 4:04 PM IST

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియంసన్ బొటన వేలికి గాయం.. బొటన వేలు ఫ్రాక్చర్ అయినట్టు తేల్చిన స్కానింగ్ రిపోర్ట్! టీమ్‌తోనే కేన్ మామ.. 


ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, 7 నెలల తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రీఎంట్రీ మ్యాచ్‌లోనే కేన్ విలియంసన్ మళ్లీ గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్ వేసిన డైరెక్ట్ త్రో, కేన్ విలియంసన్ బొటన వేలికి బలంగా తగిలింది.

107 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు చేసిన కేన్ విలియంసన్, రీఎంట్రీ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గాయంతో కేన్ విలియంసన్, రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. లేకపోతే సెంచరీ చేసేవాడే. తాజాగా కేన్ విలియంసన్ గాయానికి చేసిన స్కానింగ్‌లో అతని బొటిన వేలి ఎముక విరిగినట్టు తేలింది. దీంతో అతను చాలా మ్యాచులకు దూరం కాబోతున్నాడు..

An X-ray has confirmed an undisplaced fracture to Kane Williamson’s left thumb.

He will remain in the squad with the aim of being available for the back end of pool play next month.

Tom Blundell will travel to India as cover. https://t.co/5CjHG0FV9h

— BLACKCAPS (@BLACKCAPS)

Latest Videos

అయితే కేన్ విలియంసన్, టీమ్‌తోనే ఉండబోతున్నాడు. నవంబర్‌లో జరిగే మ్యాచుల్లో అతనే ఆడే అవకాశం ఉందని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ కామెంట్ చేశాడు..

‘కేన్ విలియంసన్ ఎంతో కష్టపడి మోకాలి గాయం నుంచి కోలుకున్నాడు. అంతలోనే మళ్లీ ఇలా గాయపడడం చాలా దురదృష్టకరం. ఇది మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచింది. గాయం నుంచి కోలుకునేవరకూ అతను టీమ్‌తోనే కొనసాగుతాడు. 

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మ్యాచులు ఆడతాడు. కేన్ విలియంసన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్, కెప్టెన్. అతన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్.. కేన్ విలియంసన్‌కి బ్యాకప్‌గా టామ్ బ్లండెల్, త్వరలో ఇండియాకి రాబోతున్నాడు. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి మూడు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న న్యూజిలాండ్, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. అక్టోబర్ 18న ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడే న్యూజిలాండ్, ఆ తర్వాత అక్టోబర్ 22న ధర్మశాలలో టీమిండియాతో మ్యాచ్ ఆడుతుంది..
 

click me!