India vs Pakistan: సిరాజ్ మియా మ్యాజిక్, హార్ధిక్ పాండ్యా మంత్రం... రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్...

By Chinthakindhi Ramu  |  First Published Oct 14, 2023, 3:32 PM IST

ICC World cup 2023: 36 పరుగులు చేసి అవుటైన ఇమామ్ ఉల్ హక్.. 20 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్.. 


అహ్మదాబాద్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్, 18 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో అబ్దుల్లా షెఫీక్ ఫోర్ బాదగా, మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఇమామ్ ఉల్ హక్ 3 ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. మూడో ఓవర్ వేసిన జస్ప్రిత్ బుమ్రా ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా ఇమామ్ ఉల్ హక్‌ని అడ్డుకున్న జస్ప్రిత్ బుమ్రా, మెయిడిన్ ఓవర్ నమోదు చేశాడు..

24 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. గత రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మహ్మద్ సిరాజ్‌కి గత నాలుగు వన్డేల్లో పవర్ ప్లేలో దక్కిన మొదటి వికెట్ ఇదే...

Latest Videos

38 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇమామ్ ఉల్ హక్ అవుట్ అయ్యే ముందు హార్ధిక్ పాండ్యా, బంతిని చేతుల్లోకి తీసుకుని ఏదో మంత్రాలు చదివినట్టు కోరుకోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది..  73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్...

మహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి రావడానికి చాలా సమయం తీసుకోవడం, క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ అతనిపై అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. క్రీజులో ఉన్న బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి కీలక బ్యాటర్లు. ఈ ఇద్దరినీ టీమిండియా బౌలర్లు ఎంత త్వరగా అవుట్ చేస్తే, పాక్‌ని అంత తక్కువ స్కోరుకి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. 

click me!