ఆస్ట్రేలియా ముందు 307 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన బంగ్లాదేశ్.. 74 పరుగులు చేసిన తోహిద్ హృదయ్...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొట్టమొదట సెమీస్ రేసు నుంచి తప్పుకున్న జట్టు బంగ్లాదేశ్. పూణేలో ఆస్ట్రేలియాతో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్, భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది..
తన్జీద్ హసన్, లిటన్ దాస్ కలిసి తొలి వికెట్‌కి 76 పరుగులు జోడించారు. 34 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసిన తన్జీద్ హసన్‌ని సీన్ అబ్బాట్ అవుట్ చేశాడు. 45 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేసిన లిటన్ దాస్‌ని ఆడమ్ జంపా పెవిలియన్ చేర్చాడు.
undefined
నజ్ముల్ హుస్సేన్ షాంటో 57 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేయగా తోహిద్ హృదయ్ 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. మహ్మద్దుల్లా 28 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
ముస్తాఫిజుర్ రహీం 24 బంతుల్లో ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేయగా మెహిదీ హసన్ మిరాజ్ 20 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ టాపార్డర్‌లో మొదటి ఏడుగురు బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.
నసుమ్ అహ్మద్ 7 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆడమ్ జంపా, సీన్ అబ్బాట్ రెండేసి వికెట్లు తీశారు. మార్కస్ స్టోయినిస్‌కి ఓ వికెట్ దక్కింది.