నవంబర్ 11, 2011న కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జిగిన మొదటి టెస్ట్ సందర్భంగా .. సఫారీలు గెలవడానికి 236 పరుగులు చేయాల్సి వుంది. ఆ రోజున డేట్ 11/11/2011 కాగా.. ఉదయం 11.11 గంటలకు సౌతాఫ్రికా విజయానికి కేవలం 111 పరుగులు మాత్రమే కావాలి.
జెంటిల్మెన్ కీడ క్రికెట్‌లో ఎన్నో విచిత్రాలు , వింతలు జరుగుతూ వుంటాయి. ఒక్కోసారి 400 పైచిలుకు పరుగులు చేసినా ఓడిపోతే.. మరోసారి 200 చేసినా గెలుస్తాం. ఇదే ఇక్కడ విచిత్రం. ఏ రోజున పరిస్ధితి ఎలా వుంటుందో చెప్పలేం. అలాగే యాధృచ్ఛికంగానో కొన్ని ఘటనలు జరుగుతూ వుంటాయి. అలాంటి వాటిలో ఒకటి 11/11/11న జరిగింది. నవంబర్ 11, 2011న కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా .. సఫారీలు గెలవడానికి 236 పరుగులు చేయాల్సి వుంది.
3వ రోజు ఆటలో భాగంగా వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. అయితే ఆ రోజున డేట్ 11/11/2011 కాగా.. ఉదయం 11.11 గంటలకు సౌతాఫ్రికా విజయానికి కేవలం 111 పరుగులు మాత్రమే కావాలి. ఆ సమయంలో ప్రేక్షకులు, అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఒక నిమిషం పాటు ఒంటికాలిపై నిలబడ్డారు. అప్పుడు స్కోర్ బోర్డ్‌పై 11.11 .. 11/11/11 అని వుంది. నిజంగా అది ఎంత యాదృచ్ఛికం.. ఆటలో అరుదైన క్షణం. అంతేకాదు.. మరో శతాబ్ధం వరకు ఇలాంటి ఘటన పునరావృతమయ్యే అవకాశం లేదు.