టీవీల్లో స‌ల‌హాలు ఇవ్వ‌డం తేలికే.. కెప్టెన్సీపై బాబర్ ఆజం కీల‌క వ్యాఖ్య‌లు..

By Mahesh Rajamoni  |  First Published Nov 11, 2023, 4:05 AM IST

Babar Azam: 'ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను, నాకు చాలా అంచనాలు ఉన్నాయి, కానీ నేను అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాను. దాన్ని నేను అంగీకరిస్తున్నాను' అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు.
 


ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ 2023లో పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంపై స్పందించిన పాక్ కెప్పెట్ బాబార్ ఆజం.. త‌న‌పై ఎలాంటి ఒత్తిడి లేద‌ని తెలిపారు. విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని బ్యాట్స్ మన్ గా మాత్రమే ఆడగలరా అన్న ప్రశ్నకు బాబర్ ఆజమ్ బదులిస్తూ గత మూడేళ్లుగా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాననీ, ఎప్పుడూ అలా అనిపించలేదని బదులిచ్చాడు. సెమీఫైనల్ కు చేరేందుకు పాక్ ప‌డుతున్న క‌ష్టాలు.. విశ్వప్రయత్నాలు నేప‌థ్యంలో బాబార్ ఆజం కెప్టెన్సీపై  ప్రశ్నలు తారాస్థాయికి చేరాయి.  ఒకవేళ పాక్ సెమీస్ గ‌న‌క చేర‌క‌పోతే కెప్టెన్సీ అంశంతో పాక్ క్రికెట్ బోర్డు విచారణ జరిపే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

'ప్రపంచకప్ లో నేను ఆశించిన స్థాయిలో రాణించలేదు కాబట్టే నేను ఒత్తిడిలో ఉన్నానని అంద‌రూ అంటున్నారు. నేను ఎలాంటి ఒత్తిడిలో లేను. గత రెండున్నర, మూడేళ్లుగా ఇదే పని చేస్తున్నాను. నేను మంచి ప్రదర్శన ఇస్తున్నాను, నేను కెప్టెన్ గా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాను' అని పేర్కొన్నాడు. అలాగే, "మీరు అలాంటిది ఎలా తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ వారి స్వంత దృక్పథం, వారి స్వంత ఆలోచనా విధానం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. అతను ఇలా ఉండాలి, లేదా అలా ఉండాలి. ఎవరైనా నాకు సలహాలు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గర నా నంబర్ ఉంటుంది. టీవీల్లో సలహాలు ఇవ్వడం సులభం. మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే, మీరు నాకు సందేశం పంపవచ్చని" పేర్కొన్నాడు.

Latest Videos

పాక్ జ‌ట్టు  ప్ర‌స్తుత ప్ర‌ద‌ర్శ‌న  కారణంగా తాను ఒత్తిడికి లోనయ్యాన‌నీ, భిన్నంగా ఫీలయ్యాన‌ని అనుకోవడం లేదని బాబార్ ఆజం తెలిపాడు. ఫీల్డింగ్ సమయంలో మైదానంలో త‌న అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాన‌నీ, బ్యాటింగ్ సమయంలో తాను జ‌ట్టును గెలిపించ‌డానికి ఎలా పరుగులు చేయాల‌నేది మాత్రమే ఆలోచిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. కాగా, పాకిస్తాన్ సెమీస్ చేర‌డానికి కీల‌కంగా మారిన మ్యాచ్ లో శ‌నివారం ఇంగ్లాండ్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.

click me!