భారీ భాగస్వామ్యం తర్వాత శ్రేయాస్ అయ్యర్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi Ramu  |  First Published Nov 5, 2023, 5:03 PM IST

India vs South Africa: 77 పరుగులు చేసి అవుటైన శ్రేయాస్ అయ్యర్... వన్డే వరల్డ్ కప్‌లో ఆరో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. 


కోల్‌కత్తా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి మెరుపు ఆరంభం అందించాడు. దీంతో మొదటి 5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది భారత జట్టు. వన్డేల్లో టీమిండియాకి మొదటి 5 ఓవర్లలో ఇదే అత్యధిక స్కోరు..

రోహిత్ మరోసారి హాఫ్ సెంచరీ ముందు అవుట్ కాగా 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని  కేశవ్ మహరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

Latest Videos

undefined

87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆరో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 

సచిన్ టెండూల్కర్ తర్వాత సౌతాఫ్రికాపై 3 వేలకు పైగా పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, స్వదేశంలో 6 వేల వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకముందు సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 6976 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 6 వేల వన్డే పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

అలాగే వన్డే వరల్డ్ కప్‌ టోర్నీల్లో 1500+ పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగర్కర మాత్రమే 1500+ వన్డే వరల్డ్ కప్ పరుగులు చేశారు.. 

click me!