India vs South Africa: మెరుపులు మెరిపించి అవుటైన రోహిత్, శుబ్‌మన్ గిల్... 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

Google News Follow Us

సారాంశం

ICC World cup 2023: 40 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 23 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌.. 10 ఓవర్లలోనే 91 పరుగులు చేసిన భారత జట్టు..

 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత జట్టు. భారత ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి భారత జట్టుకి మెరుపు ఆరంభం అందించారు. 

మొదటి ఓవర్‌లో 4 బాదిన రోహిత్ శర్మ 5 పరుగులు రాబట్టాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో వైడ్ల రూపంలో 8 పరుగులు వచ్చాయి. శుబ్‌మన్ గిల్ రెండు ఫోర్లు బాదడంతో 17 పరుగులు రాబట్టింది భారత జట్టు..

లుంగి ఇంగిడి వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో 4, 6, 6 బాదిన రోహిత్ శర్మ 16 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్లు ముగిసే సరికే 61 పరుగులు దాటేసింది టీమిండియా స్కోరు. 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కగిసో రబాడా బౌలింగ్‌లో తెంబ భవుమాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

62 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది భారత జట్టు. 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని కేశవ్ మహరాజ్ ఓ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో రన్ రేట్ తగ్గింది..


11వ ఓవర్ నుంచి 18వ ఓవర్ మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదు.