ICC World cup 2023: టాస్ గెలిచిన టీమిండియా... టేబుల్ టాప్ పొజిషన్ కోసం సౌతాఫ్రికాతో...

By Chinthakindhi Ramu  |  First Published Nov 5, 2023, 1:55 PM IST

India vs South Africa: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా, సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఇప్పటిదాకా గెలిచిన 6 మ్యాచుల్లో 5 సార్లు తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చినవే.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది పాకిస్తాన్. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా రెండు జట్లు కూడా సెమీ ఫైనల్‌కి అర్హత సాధించాయి. అయితే నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్‌గా సెమీస్‌ చేరుతుంది..

Latest Videos

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, తెంబ భవుమా (కెప్టెన్), రస్సీ వాన్ దేర్ దుస్సేన్, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసీ, కగిసో రబాడా, లుంగి ఇంగిడి 

click me!