అహ్మదాబాద్ లో ఇదే ఆశిస్తున్నాం..: ఇండియాతో మ్యాచ్ పై పాక్ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Oct 2, 2023, 10:26 AM IST

ఐసిసి ప్రపంచ కప్ కు ముందు పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 


హైదరాబాద్ : ఐసిసి వరల్డ్ కప్ కోసం చాలాకాలం తర్వాత దాయాది పాకిస్థాన్ జట్టు ఇండియాలో అడుగుపెట్టింది. బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాక్ టీం ప్రస్తుతం మన హైదరాబాద్ లోనే వున్నారు. ఇక్కడి ఆతిథ్యానికి, అభిమానానికి ఫిదా అవుతున్నారు పాక్ క్రికెటర్లు. ఇలాంటి ప్రేమాభిమానమే అహ్మదాబాద్ లో కూడా పొందుతామని ఆశిస్తున్నామంటూ టీమిండియాతో జరగనున్న మ్యాచ్ పై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ఐసిసి వరల్డ్ కప్ టోర్నీకి ముందు పాకిస్థానీ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భారతీయ సినిమాలు, హైదరబాదీ ఫుడ్ తనకెంతో ఇష్టమని ఈ పాక్ ప్లేయర్ వెల్లడించాడు. అజయ్ దేవగన్ యాంగ్రీ పోలీస్ మెన్ గా నటించిన 'సింగం' మూవీ డైలాగ్ ను ఏమాత్రం తడబడకుండా చెప్పి అందరినీ ఆశ్యర్యానికి గురిచేసాడు. ''ఇక్కడికి సింహం కూడా వచ్చింది (సింగం బి ఆయే హై యహా పె)'' అంటూ పాక్ వైస్ కెప్టెన్ నోట బాలీవుడ్ డైలాగ్ వినిపించింది. 

Latest Videos

undefined

ఇక హైదరాబాద్ లో అడుగుపెట్టగానే విమానాశ్రయంలో ఆహ్వానం,  ఆ తర్వాత హోటల్లో లభించిన ఆతిథ్యం అద్భుతమని షాదాబ్ ఖాన్ అన్నారు. ఇక హైదరబాదీ ప్రజలు చూపిస్తున్న అభిమానం కూడా మరిచిపోలేనిదని అన్నారు. 'సిటి ఆప్ నిజాంస్' పాకిస్థాన్ టీం ను ఆత్మీయంగా చూసుకుంటోందంటూ హైదరాబాద్ అనుభవాలను మీడియాకు తెలిపారు పాక్ ఆల్ రౌండర్. 

Read More  అక్కడి ముస్లింలు మాకే సపోర్ట్! అందుకే వచ్చారు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..

హైదరాబాదీ ఫుడ్ టేస్ట్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే... ఇక మాసాంహారాన్ని ఇష్టపడే పాకిస్థానీ ఆటగాళ్లు ఇక్కడి ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని షాదాబ్ ఖాన్ తనదైన చమత్కారంతో వెల్లడించారు. ఎంతో రుచికరమైన హైదరబాదీ ఆహారాన్ని ఎక్కువగా తింటున్నాం... దీంతో లావెక్కిపోతావేమోనని టీం సహాయక సిబ్బంది ఆందోళన చెందుతున్నారంటూ షాదాబ్ నవ్వుతూ చెప్పారు. ఇలా హైదరాబాద్ లో లభించినట్లే అహ్మదాబాద్ లో కూడా ప్రేమాభిమానాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ పేర్కొన్నారు. 

ఆసియా కప్ లో తాము చేసిన తప్పులేంటో తెలుసుకున్నామని... ఆ తప్పులు వరల్డ్ కప్ టోర్నీలో చేయబోమని షాదాబ్ వెల్లడించారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్ లో వుందని... అయినా అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో విజయం తమదేనని షాదాబ్ దీమా వ్యక్తం చేసాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటే తనకెంతో అభిమానమని... అతడి డేంజరస్ బ్యాటింగ్ ను ఇష్టపడతానని అన్నారు. ఇక కుల్దీప్ యాదవ్ భయంకరమైన భారత బౌలర్ గా పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ పేర్కొన్నారు. 


 

click me!