బౌండరీ గురించి గొడవ... డబ్ల్యూడబ్ల్యూఈని తలపించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌...

Published : Oct 01, 2023, 01:27 PM IST
బౌండరీ గురించి గొడవ... డబ్ల్యూడబ్ల్యూఈని తలపించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌...

సారాంశం

బౌండరీ ఇవ్వలేదని బంగ్లాదేశ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కొట్లాట... ఆరుగురు ప్లేయర్లకు గాయాలు.. 

గల్లీ క్రికెట్‌లో బౌండరీ గురించి గొడవలు పడడం సహజం. చిన్న విషయానికి గొడవ పడి, కొట్లాడడం కూడా చాలా కామన్. అయితే ఇలాంటి సంఘటనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో జరిగింది. ఏదో సరదాకి క్రికెట్ ఆడేందుకు వచ్చిన సెలబ్రిటీలు, చిన్న విషయానికి గొడవ పడి... క్రికెట్ స్టేడియాన్ని రణరంగంగా మార్చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిందీ సంఘటన..

డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌లా 30 మందికి పైగా ప్లేయర్లు, రౌండ్‌ మధ్యలో కొట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఫిల్మ్ మేకర్స్ మొస్తఫా కమల్ రాజ్, దీపాంకర్ డిపోన్ టీమ్స్ మధ్య గ్రూప్ మ్యాచ్‌లో జరిగిందీ రచ్చ...

ఈ మ్యాచ్‌లో అంపైర్ ఇచ్చిన ఓ నిర్ణయం గురించి మొదలైన గొడవ, మాటామాటా పెరిగి, ఇరు జట్ల ప్లేయర్లు కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ గొడవలో ఆరుగురు ప్లేయర్లు తీవ్రంగా గాయపడ్డారు.. క్లియర్‌గా బౌండరీ దాటినా అంపైర్ ఫోర్ ఇవ్వడం లేదని బ్యాటింగ్ టీమ్ ఆరోపించడంతో మొదలైన గొడవ, ఆరుగురు ప్లేయర్లు గాయపడి, మ్యాచ్‌ని రద్దు చేసేదాకా వెళ్లింది.. 

బంగ్లాదేశ్ నటీనటులు సిషిర్ సర్దార్, రాజ్ రిపా, జో చౌదరీ, అతిక్ రెహ్మాన్, షేక్ షువో, అసిఫ్ జావెద్‌లకు గాయాలు అయినట్టు సమాచారం. ఈ గొడవకు ముందు బంగ్లాదేశ్ నటి రాజ్ రిపా, అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయం వల్ల తాము ఓడిపోయే పరిస్థితి వచ్చామని ఆరోపిస్తూ కెమెరా ముందు ఏడ్చేసింది. మేనేజ్‌మెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని ఆరోపిస్తూ రోదించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది..
 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !