బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఆసీస్.. 177 పరుగులు చేసిన మిచెల్ మార్ష్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయాన్ని అందుకుంది. తొలి రెండు లీగ్ మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా, వరుసగా 7 విజయాలతో సెమీస్‌కి చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆసీస్..
307 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్‌కి మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ని టస్కిన్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ కలిసి రెండో వికెట్‌కి 120 పరుగులు జోడించారు..
undefined
61 బంతుల్లో 6 ఫోర్లతో 53 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 175 పరుగులు జోడించారు.. మిచెల్ మార్ష్, ఈ వరల్డ్ కప్‌లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు..
మరో వైపు వన్డే కెరీర్‌లో 32వ హాఫ్ సెంచరీ అందుకున్న స్టీవ్ స్మిత్, వరల్డ్ కప్‌లో 11వ సారి 50+ స్కోరు నమోదు చేశాడు. మిచెల్ మార్ష్ 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 177 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 64 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగుల భారీ స్కోరు చేసింది.