భారత్ తర్వాత మీరే బాగా ఆడారు! ఆఫ్ఘాన్‌పై గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం...

By Chinthakindhi Ramu  |  First Published Nov 11, 2023, 5:11 PM IST

ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌పై ఘన విజయాలు అందుకున్న ఆఫ్ఘనిస్తాన్... ఉపఖండ దేశాల్లో భారత్ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇచ్చిన దేశంగా గుర్తింపు.. 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగింది ఆఫ్ఘనిస్తాన్. గత ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఆఫ్ఘాన్, ఈసారి 4 ఘన విజయాలతో ఆఖరి మ్యాచ్ వరకూ సెమీస్ రేసులో నిలిచింది..

ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌పై ఘన విజయాలు అందుకున్న ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 91 పరుగులకే 7 వికెట్లు తీసింది. ఆసీస్ జట్టును వణికించిన ఆఫ్ఘాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ కారణంగా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది..

Latest Videos

undefined

ఆ మ్యాచ్ గెలిచి ఉంటే, సెమీస్ లెక్కలన్నీ మారిపోయి ఉండేవి. ఆస్ట్రేలియా, సెమీస్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదంలో పడి ఉండేది. ఆఫ్ఘాన్, వరల్డ్ కప్ పర్ఫామెన్స్‌పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

‘ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీలో ఇంగ్లాండ్‌ని ఓడించింది. చెన్నైలో పాకిస్తాన్‌ని ఓడించి, పూణేలో శ్రీలంకను చిత్తు చేశారు. ఇకపై ఈ టోర్నీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ టీమ్ ఆటతీరు పూర్తిగా మారిపోతుంది..

ఉపఖండంలో భారత్ తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచింది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే ఆఫ్ఘానిస్తాన్ చాలా మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ దాదాపు గెలిచేశారు..

ఇకపై ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ అంటే మిగిలిన జట్లు కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందే. వరల్డ్ కప్ పర్ఫామెన్స్, ఆఫ్ఘాన్ టీమ్ కాన్ఫిడెన్స్‌ని రెట్టింపు చేస్తుంది..’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..
 

click me!